Dhamki Review: విశ్వక్ సేన్ ధమ్కీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Dhamki Review: విశ్వక్ సేన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'దాస్ కా ధమ్కీ ' నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Dhamki Review: విశ్వక్ సేన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ ‘ నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

నటీనటులు : విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, తరుణ్ భాస్కర్, అక్షరా గౌడ, ‘హైపర్’ ఆది, ‘రంగస్థలం’ మహేష్, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు.
సంగీతం : లియోన్ జేమ్స్
నిర్మాత : కరాటే రాజు
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : విశ్వక్ సేన్

యువ కథానాయకుడు విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఈ సినిమాకు స్వయంగా తానే దర్శకత్వం వహించాడు.దీంతో విశ్వక్ సేన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇక ఈ సినిమాకు ఆయన తండ్రి నిర్మాతగా వ్యవహరించారు. ‘పాగల్’ తర్వాత విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ మరోసారి జంటగా నటించారు.

ఇదే కథ.. (Dhamki Review)

కృష్ణదాస్ (విశ్వక్ సేన్) ఓ అనాథ. ఈ సినిమాలో అతను ఓ స్టార్ హోటల్‌లో వెయిటర్ పని చేస్తుంటాడు.

ఓ రోజు హోటల్‌కు వచ్చిన కీర్తీ (నివేదా పేతురాజ్)తో ప్రేమలో పడతాడు. వెయిటర్ అనే విషయం దాచి అబద్ధాలు ఆడతాడు.

ఆమెతో తానొక పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో అని చెబుతాడు. కానీ కృష్ణదాస్ వెయిటర్ అనే విషయం కీర్తీకి తెలుస్తుంది.

అప్పటి వరకు ఆమె కోసం చేసిన పనుల కారణంగా ఉద్యోగం పోతుంది. రెంట్ కట్టలేదని హౌస్ ఓనర్ సామాన్లు విసిరేస్తాడు.

ఆల్మోస్ట్ రోడ్డు మీదకు వస్తున్న సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా (రావు రమేష్) వస్తాడు.

తన అన్నయ్య కుమారుడు సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్) క్యాన్సర్ చికిత్సకు ఓ డ్రగ్ కనిపెట్టాడని, రీసెర్చ్ మధ్యలో చనిపోయాడని చెబుతాడు.

అతడిలా నటించమని చెబుతాడు. సంజయ్ రుద్ర ఇంటికి వెళ్లిన కృష్ణదాస్ షాక్ అవుతాడు.

ఎందుకంటే… ఆ సంజయ్ రుద్ర ఎవరో కాదు, ఫార్మా కంపెనీ సీఈవో! అతడి స్థానంలోకి కృష్ణదాస్ వెళ్లిన తర్వాత ఏమైంది? కథ ఎన్ని మలుపులు తిరిగింది? అనేది వెండితెరపై చూడాలి.

 

‘దాస్ కా ధమ్కీ’ సినిమా విడుదలకు ముందు దీనిపై నెగెటివ్ ప్రచారం కొనసాగింది. ఈ సినిమా ‘ధమాకా’ కథను అటు ఇటు తిప్పి తీశారని ప్రచారం జరిగింది.

అందులో నిజం లేదని దర్శక, రచయితలు ఖండించారు. అది నిజమే. ‘ధమాకా’తో పాటు ‘ఖిలాడీ’ని కూడా గుర్తు చేస్తుందీ సినిమా.

కొన్ని సీన్లు, ఫైట్లు ఇంతకు ముందు వచ్చిన తెలుగు సినిమాలను అక్కడక్కడా గుర్తు చేస్తాయి. అందువల్ల, సినిమా కొత్త ఫీల్ ఏమీ ఇవ్వదు.

కొత్త కథ లేకున్నా కొన్ని సినిమాలు నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటీ కలిగిస్తాయి.

‘దాస్ కా ధమ్కీ’లో అటువంటి క్యూరియాసిటీ కలిగించే మూమెంట్స్ ఏమీ లేవు.

వెయిటర్ కాదని ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుందనే ట్విస్ట్ దగ్గర నుంచి, ఆ తర్వాత ట్విస్టులు కూడా ఊహించేలా ఉన్నాయి. దర్శకుడిగా టెక్నికల్ టీమ్ నుంచి విశ్వక్ సేన్ మంచి అవుట్ పుట్ తీసుకున్నారు. స్క్రీన్ ప్లే మీద కాన్సంట్రేట్ చేసి ఉంటే ఇంకా బావుండేది.

నటీనటులు ఎలా చేశారు?

హీరోగా విశ్వక్ సేన్ తన మార్క్ ను చూపించాడు. ఇందులో రెండు పాత్రమ మధ్య వేరియేషన్ చక్కగా చూపించాడు. నివేదా పేతురాజ్ నటన కన్నా గ్లామర్ పాత్రలో అలరించింది. ఇక రావు రమేష్ సైతం తన పాత్రకు న్యాయం చేశాడు. ‘హైపర్’ ఆది, ‘రంగస్థలం’ మహేష్ తమ పాత్ర పరిధి మేరకు కామెడీ చేసే ప్రయత్నం చేశారు. కొంత వరకు సక్సెస్ అయ్యారు. ‘హ్యాపీడేస్’లో టైసన్ లాంగ్వేజ్ డెలివరీతో మహేష్ డైలాగులు చెప్పారు. తరుణ్ భాస్కర్, మహేష్ మధ్య సీన్ పేలింది. అజయ్, అక్షరా గౌడ, పృథ్వీరాజ్, రజత… తదితరులకు పెద్దగా నటించే అవకాశం లభించలేదు. వాళ్ళవి రెగ్యులర్ రోల్స్. డైలాగులు పెద్దగా లేకపోయినా తల్లి పాత్రలో రోహిణి ఆకట్టుకున్నారు.

లవ్ ట్రాక్ నుంచి మెయిన్ కాన్సెప్ట్ ట్విస్టుల వరకు ‘దాస్ కా ధమ్కీ’లో చాలా సినిమాలు కనపడతాయి. పైన చెప్పినట్లు… ‘ధమాకా’, ‘ఖిలాడీ’ ప్రభావం ఎక్కువ ఉంది. కథతో, లాజిక్కులతో ఏమాత్రం సంబంధం లేకపోయినా… మధ్య మధ్యలో కామెడీ బావుంటే చాలని కోరుకునే ప్రేక్షకులు ‘దాస్ కా ధమ్కీ’కి వెళ్ళవచ్చు.

రేటింగ్ : 2.5/5