Site icon Prime9

Rashmika Mandanna : ఆనంద్ దేవరకొండ “బేబీ” మూవీని చూసిన రష్మిక.. ఇంతకీ ఏమందంటే ???

rashmika mandanna shocking comments on baby movie

rashmika mandanna shocking comments on baby movie

Rashmika Mandanna : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.. సాయి రాజేష్ దర్శకత్వంలో నటించిన చిత్రం “బేబీ”. ఈ సినిమాలో యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేయగా.. విరాజ్ అశ్విన్ కీలకపాత్ర చేశాడు. డైరెక్టర్ మారుతీ, నిర్మాత ఎస్కేఎన్ కలిసి మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేషనల్ అవార్డు అందుకున్న “కలర్ ఫోటో” సినిమాకు సాయి రాజేష్ రైటర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా.. మంచి కలెక్షన్లను రాబడుతూ మూవీ దూసుకుపోతుంది.

అయితే తాజాగా ఈ చిత్రాన్ని రష్మిక మందన్నా వీక్షించింది. అలానే ఈ చిత్రం అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టింది. ఆ పోస్ట్ లో.. బేబీ చిత్రాన్ని చూశాను. మూవీలో అద్భుతమైన ఎమోషనల్ పెర్ఫామెన్స్ చూసి ఏడుపు వచ్చేసింది. ప్రతి సన్నివేశం నా హృదయంలో చాలా కాలం నిలిచిపోతుంది. చిత్ర యూనిట్ కి నా అభినందనలు’ అంటూ రాసుకొచ్చింది.

ఇక గత కొంతకాలంగా రష్మిక – విజయ రిలేషన్ షిప్ లో ఉన్నారనే రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. వెకేషన్స్ కి వీరు ఇద్దరూ కలిసి వెళ్ళడం.. అక్కడ నుంచి ఫోటోలు లీక్ అయ్యి వైరల్ అయ్యాయి కూడా. ఇక ఇప్పుడు విజయ్ తమ్ముడి సినిమా గురించి రష్మిక ఇలా ట్వీట్ చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version