Site icon Prime9

Rashmika Mandanna : “యానిమల్” మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

rashmika mandanna poster released from animal movie

rashmika mandanna poster released from animal movie

Rashmika Mandanna : నేషనల్ క్రష్ “రష్మిక మందన్న” టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో వరుస సినిమాల్లో నటిస్తూ  దూసుకుపోతుంది. “ఛలో” సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన “రష్మిక మందన్న” .. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్, పుష్ప చిత్రాల్లో నటించింది. “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ. గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఉత్తరాది లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేతి నిండా పాన్ ఇండియా సినిమాలే ఉండడం గమనార్హం.

అదే విధంగా రష్మిక ప్రస్తుతం.. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ మూవీలో చేస్తుంది. టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌ పతాకాలపై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్‌ కుమార్‌, ప్రణవ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ టీజర్ చూస్తే.. సందీప్ చెప్పినట్టుగానే ఒక రేంజ్ వైలెన్స్ ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో.. డిసెంబర్ 1న సినిమా విడుదల కానుంది.

కాగా ఇటీవలే ఈ నెల 28న ఉదయం 10 గంటలకు టీజర్ కూడా ఈ ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా (Rashmika Mandanna) నుంచి రష్మిక ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో రష్మిక “గీతాంజలి” అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

ఇక అలానే ప్రస్తుతం ‘యానిమల్’ కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’లో సైతం రష్మిక నటిస్తున్నారు. అలానే నితిన్ – వెంకీ కాంబోలో వస్తున్న మూవీలో చేస్తుంది. వాటితో పాటే ‘రెయిన్ బో’ సినిమా చేస్తుండగా.. రవితేజ – గోపీచంద్ మలినేని సినిమాలో ఆమె నటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Exit mobile version