Site icon Prime9

Rashmika : కన్నడ సినిమాల్లో బ్యాన్ పై నోరు విప్పిన రష్మిక మందన్నా..!

rashmika-mandanna-opens-about-her-comments-on-kantara

rashmika-mandanna-opens-about-her-comments-on-kantara

Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి అందరికి తెలిసిందే. ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హెరోయిన్ గా మారింది. ఇక డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకుంది రష్మిక. ఈ మూవీతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకుంది.

దీంతో అటు దక్షిణాది లోనే కాకుండా బాలీవుడ్ లోనూ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే కొద్ది రోజులుగా కన్నడ సినీ ప్రేక్షకులు రష్మిక ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే… ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘కాంతార’ సినిమా చూశారా అని ఒక యాంకర్ ప్రశ్నించగా… లేదు చూడలేదు అంటూ బదులిచ్చింది. అయితే కాంతార తెరకెక్కించిన రిషబ్ శెట్టి దర్శకత్వంతోనే రష్మిక సినీ పరిశ్రమకు పరిచయమైంది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది.

ఇక ఆ తర్వాత పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనను పరిచయం చేసిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండా సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ వేళ్లతో చూపించింది. ఇక రష్మిక తీరుపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రిషబ్ శెట్టి సైతం రష్మికకు కౌంటరివ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదం పై స్పందించిన రష్మిక తన మనసులో మాటలని బయట పెట్టింది.

కన్నడ చిత్ర పరిశ్రమ నాపై ఎలాంటి నిషేధం విధించలేదు. కాంతార సినిమా విడుదలైన కొత్తలో మూవీ చూశారా ? అని అడిగారు.. అప్పటికీ ఇంకా చూడలేదు. కాబట్టి లేదు అని చెప్పాను. ఆ తర్వాత చూసి చిత్రబృందానికి మెసేజ్ పెట్టాను. థాంక్యూ అని రిప్లై కూడా ఇచ్చారు. కానీ బయట ప్రచారం అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు. నా జీవితంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలీదు. ఇన్ సైడ్ ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు. ప్రతి మెసేజ్ సోషల్ మీడియా లో పెట్టలేం. ప్రొఫెషన్ పరంగా నేను ఏం చేస్తున్నానో అది ప్రజలకు చెప్పడం నా బాధ్యత. అంతేగాని నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను అంటూ తెలిపారు. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Exit mobile version