Site icon Prime9

Rashmika Mandanna : ఆ విషయంలో సౌత్ కంటే నార్త్ బెటర్ అంటున్న రష్మిక…

rashmika-mandanna-comments-on-south-film-industry

rashmika-mandanna-comments-on-south-film-industry

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్ లో ఉందని చెప్పాలి. ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో నటించిన “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. ఈ మూవీతో దక్షిణాది లోనే కాకుండా ఉత్తరాది లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ అయ్యింది.

బాలీవుడ్ లో వరుస ఆఫర్లను ఒకే చేస్తున్న ఈ భామకి సరైన హిట్ పడలేదనే చెప్పాలి . ఇటీవల గుడ్ బై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మికకు… ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో నటిస్తున్న మిషన్ మజ్ను పైనే ఈ అమ్మడు ఆశ పెట్టుకుంది. అయితే ఊహించని రీతిలో ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆమె ఆశల మీద నీళ్ళు జల్లినట్లు అయ్యింది. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గోంటున్న రష్మిక… సౌత్ ఇండస్ట్రి గురించి చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడింది.

ఇటీవల కాంతారా చిత్రం విషయంలో ఫుల్ గా ట్రోల్ అయిన రష్మికకు మరోసారి గట్టి దెబ్బ తగులుతుంది. తాజాగా సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది రష్మిక. చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సాంగ్స్ చూస్తూనే తాను పెరిగానని… సౌత్ సినిమాల్లో ఐటెం నంబర్స్, డ్యాన్స్ నంబర్సే ఎక్కువ ఉంటాయని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆమె మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీంతో నెటిజన్లు అంతా ఆమెపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆఫర్ల కోసం అడ్డమైన కూతలు కూసే నీలాంటి వాళ్ళకి సిగ్గుండాలి అని, తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకొని ఇప్పుడు సౌత్ సినిమాలోనూ కామెంట్ చేయడం కరెక్ట్ ఏనా అని కామెంట్లు చేస్తున్నారు. పలువురు నెటిజన్లు అయితే ఏకంగా అసభ్య పదజాలంతో ఫుల్ గా ఫైర్ అవుతున్నారు.

rashmika 2

ఆమెను కేవలం కన్నడలోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనే బ్యాన్ చేయాలంటూ మరో కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. గతంలో తనకు మొదటి ఛాన్స్ ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండా సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ చేతి వేళ్లతో యాటిట్యూడ్ చూపించింది. ఇక ఆమె మాటలకు డైరెక్టర్ రిషబ్ శెట్టి కౌంటరిచ్చారు. దీంతో రష్మిక ప్రవర్తనపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను కన్నడలో బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

Exit mobile version