Site icon Prime9

Ranjithame Song: రంజితమే పాటకు ’కడుపులో బిడ్డ డ్యాన్స్..‘ వీడియోషేర్ చేసిన తమన్

varasudu Ranjithame

varasudu Ranjithame

Ranjithame Song: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన చిత్రం వార‌సుడు. హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయింది.

తమన్ సంగీతం అందించిన ‘రంజితమే.. రంజితమే’సాంగ్ మూవీ రిలీజ్ ముందే యూట్యూబ్ ను షేక్ చేసింది.

ఎక్కడ చూసినా ఈ సాంగ్ తో రీల్స్, స్నాప్ చాట్స్ కనిపిస్తాయి. తాజాగా ఈ సాంగ్ సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.

చాలా హ్యాపీగా ఉంది

రంజితమే సాగ్ తమ కుటుంబానికి ఎంతో స్పెషల్ అని కేరళకు చెందిన ఓ ఫ్యామిలీ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఒక తల్లి కడుపులో ఉన్న బిడ్డ రంజితమే సాంగ్ వినిపించగానే కదులుతోంది.

పాట వినిపించిన ప్రతిసారీ ఇలాగే లోపల డ్యాన్స్ చేస్తోందని తన ఆనందాన్ని పంచుకుంది ఓ తల్లి. ఈ వీడియోపై తమన్ స్పందిస్తూ.. వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందన్నాడు.

ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. బిడ్డ భూమి మీదకు రాకుండానే డ్యాన్స్ వేస్తుందని.. ఇక పెద్దయ్యాక మంచి డ్యాన్స్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

మంచి ఊపున్న పాట వింటే చిన్నా పెద్దా తేడా లేకుండా డ్యాన్స్ వేస్తాం. కానీ కడుపులో బిడ్డ పాట వినగానే గెంతులేయడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

ఫ్యామిలీ ఎంటర్ టైనగా తెరకెక్కిన వారిసు జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. పండుగకు కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే సినిమా అని పలువురు ప్రముఖలు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదే సినిమా వారసుడు పేరుతో తెలుగులో జనవరి 14 న విడుదల చేశారు. తమిళనాడుతో పోలిస్తే మూడు రోజుల ఆలస్యంగా తెలుగులో విడుదల అయింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version