Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నాడు. ఫిల్మ్ కెరీర్ పరంగా బ్రహ్మస్త్ర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో.. పర్సనల్ లైఫ్ లోనూ తండ్రిగా హ్యాప్పీగా ఉన్నాడు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘యానిమల్’. బాలీవుడ్ సినిమాగా వస్తున్న ఈ చిత్రం పై టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్యాంగ్ స్టార్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ షూటింగ్ గత ఏడాది ఏప్రిల్ లో మొదలైంది. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా చిత్రీకరణ ఫిబ్రవరి 21 న పూర్తి అయ్యింది.
రణ్‌బీర్ కపూర్ ఏమన్నారంటే..
మరో వైపు రణ్‌బీర్ కపూర్ త్వరలో తూ జూఠీ మెయిన్ మక్కార్ అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు రణ్‌బీర్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు షాకింగ్ రిప్లయ్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. ఆ ప్రెస్ మీట్ లో ఓ మహిళా జర్నలిస్ట్.. బాలీవుడ్ ఇంకా డల్ గానే ఉంది కదా అంటూ అడుగుతుండటంతో రణబీర్.. ఏం మాట్లాడుతున్నారు మీరు, పఠాన్ కలెక్షన్స్ చూడలేదా అని అన్నాడు. వెంటనే రణ్‌బీర్.. మీరు ఏ సంస్థ నుంచి వచ్చారు అని అడగగా ఆమె బీబీసీ అని చెప్పింది. దీంతో రణబీర్.. మీ ఆఫీస్ లో ఏం జరుగుతుంది, బయటకి చెప్తున్నారా ? ఏదో జరుగుతుంది కదా.. దాని గురించి ముందు మీరు చెప్పండి అంటూ ఇటీవల బీబీసీపై జరిగిన ఐటీ రైడ్స్ ని ఉద్దేశిస్తూ కౌంటర్ వేశాడు.
Actor #RanbirKapoor Trolled BBC 😂🤣🤣🤣🔥🔥🔥 pic.twitter.com/PBu7g5K2HH
— Narendra Modi fan (@narendramodi177) February 22, 2023
దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. బాలీవుడ్ ప్రేక్షకులు బీబీసీకి కౌంటర్ పడింది అంటూ వీడియోని షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా దీనస్థితిలో ఉన్న బాలీవుడ్ ని పఠాన్ సినిమా ఆదుకుంది అని చెప్పాలి. పఠాన్ సినిమా ఇటీవలే 1000 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసి భారీ విజయం సాధించి.. బాలీవుడ్ కి నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది అని చెప్పాలి. దీంతో బాలీవుడ్ లో రాబోయే సినిమాలు కూడా పఠాన్ ని చూసి ధైర్యంతో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.
యానిమల్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టి-సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ-1 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆగష్టు 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/