Site icon Prime9

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ.. వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే ??

ram gopal varma vyuham, sapadham movie release dates announced

ram gopal varma vyuham, sapadham movie release dates announced

Ram Gopal Varma : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ… తనకు నచ్చినట్టుగా బతికేస్తుంటారు. గతంలో ఎన్ని బ్లాక్ బస్టర్ లను అందించిన వర్మ, ఈ మధ్య కాలంలో తన చిత్రాలతో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు.ఈ పేరు ఒక సంచలనం తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు వుండరు.. ఒక సినిమాను అనౌన్స్‌చేయడంలో అలాగే వెరైటీగా ప్రమోషన్స్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ ప్లాన్స్ ఎంతో డిఫరెంట్‌గా ఉంటాయి. తన సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో కాస్త భిన్నంగా ఆలోచిస్తూ వుంటారు వర్మ.. ఒక సినిమాని ఊహించని విధంగా ప్రమోట్ చేయడం లో వర్మ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు..

ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలు ఎంతో ఆసక్తి గా మారాయి. ఏపీ సీఏం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా “వ్యూహం” అనే సినిమాను తెరకెక్కిస్తోన్నాడు. కుట్రలకీ, ఆలోచనలకు మధ్య అసామాన్యుడిగా ఎదిగిన వైఎస్ జగన్ కథతో ఈ రెండు సినిమాల్ని తెరకెక్కించబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. అయితే వైఎస్ మరణం తర్వాత జగన్ కుటుంబంలో జరిగిన పరిస్థితులను అలాగే అతడి పై పడ్డ క్రిమినల్ కేసులను వ్యూహం సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రిగా జగన్ ఎలా విజయాన్ని సాధించాడన్నది శపథం సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం.

తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ను కూడా ఆయన అనౌన్స్ చేశాడు. ఈ సీక్వెల్‌కు శపథం అనే టైటిల్‌ను ఖరారు చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాల విడుదల తేదీలని అనౌన్స్‌ చేశాడు. వ్యూహం సినిమాను నవంబర్ 10 వ తేదీన, అలాగే వ్యూహం సినిమాకు సీక్వెల్ గా వస్తున్న శపథం సినిమాను 2024 జనవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్ నటిస్తున్నాడు. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించబోతున్నది. ఈ సినిమాలను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు.

 

 

Exit mobile version