Site icon Prime9

Vyooham Movie : రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ టీజర్ రిలీజ్.. వారే టార్గెట్ గా మూవీ ఉండనుందా ?

ram gopal varma vyooham movie teaser released

ram gopal varma vyooham movie teaser released

Vyooham Movie : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. ఏపీ రాజకీయాల నేపథ్యంలో ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను తెరకెక్కిస్తున్నానని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ముందుగా ‘వ్యూహం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. అందులో భాగంగా ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ కూడా చేశారు.

ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్‌, భారతీగా మానస నటించగా.. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా వ్యూహం టీజర్‌ను రిలీజ్‌ చేశారు వర్మ. టీజర్ ని గమనిస్తే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హెలీకాప్టర్‌ ప్రమాదంతో టీజర్‌ ప్రారంభం అవుతుంది. సీఎం జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది ? ఆ సమయంలో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? లాంటి అంశాలను ప్రస్తావిస్తూ టీజర్‌ సాగింది. టీజర్‌ మొత్తంలో ఒకే ఒక్క డైలాగ్‌ ఉండడం గమనార్హం. ‘అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు’ అని జగన్ పాత్రధారి చెప్పారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

Exit mobile version