Ram Charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నారు. కాగా ఇప్పుడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వేదిక పంచుకోనున్నారు. రెండు రోజుల్లో ఇండియా టుడే కాన్ క్లేవ్ లో వీరిద్దరూ పాల్గొననున్నారు.
ప్రధాని మోదీ రామ్ చరణ్ (Ram Charan Tej) ని సత్కరించనున్నారా..?
ఇదే కార్యక్రమంలో చరణ్ ను ప్రధాని మోదీ సత్కరించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఈనెల 17, 18 తేదీల్లో ఇండియా టుడే కాన్ క్లేవ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొననున్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న ఈవెంట్ కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొననున్నారు. ఆస్కార్ తర్వాత చరణ్ తొలిసారి రాబోతుండటంతో అక్కడ ఘనంగా సన్మానించడానికి ఏర్పాట్లు జరగనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ, సచిన్ కలిసి చరణ్ ను సత్కరిస్తారని సమాచారం. తర్వాత ఇదే వేదికపై నుంచి రామ్ చరణ్ ప్రసంగిస్తారని తెలుస్తోంది. పలు అంశాలపై తన అభిప్రాయాలను చరణ్ పంచుకోనున్నారు. అలాగే నటుడిగా తన ప్రయాణం, ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విధానం, గ్లోబల్ వైడ్ సక్సెస్ కావడం, ఆస్కార్ గెలుచుకోవడం వంటి విషయాలను చరణ్ వివరించనున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం “ఆర్ఆర్ఆర్”. రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ మూవీలో.. ఆలియా భట్, ఒలీవియో హీరోయిన్లుగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ముఖ్య పాత్రల్లో అజయ్ దేవగణ్, శ్రియా నటించగా.. కీరవాణి సంగీతం అందించారు. ఇక ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు వేదికల మీద తన సత్తా చాటుకుంది ఆర్ఆర్ఆర్. ఎన్నో అవార్డ్ లను కైవసం చేసుకుంది. ఇక ఇటీవలే ఆస్కార్ ను సైతం చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాని చాటి చెప్పింది.
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం RC15 లో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు కియారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 27న చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది అంటూ ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి మేకర్స్ ఏ సర్ ప్రైజ్ ఇస్తారో అని..