Naatu Naatu Song: టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి “RRR” చిత్రం గత కొద్దిరోజులుగా వార్తలో నిలుస్తోంది.
ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్దు వచ్చిన విషయం తెలిసిందే.
దీనితో ప్రతీ ఒక్కరూ ఈ పాట గురించి ప్రస్తావిస్తున్నారు.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ హోదాలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ 2023 సమ్మిట్‌కు హాజరైన ఉపాసన తల్లి శోభనా కామినేని కూడా ఇదే విషయాన్ని షేర్ చేసుకున్నారు.
భారత్ కు చెందిన ఒక చానల్ జర్నలిస్ట్ శోభనను కలుసుకుని RRR గురించి అడిగారు.
దీనితో ఆమె, రామ్ చరణ్ తన అల్లుడు కావడం వల్ల RRR గురించి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయని అన్నారు.
అదే సమయంలో, జర్నలిస్ట్‌తో కలిసి, ఆమె ‘నాటు నాటు’ పాటకు ఉత్సాహంగా కాలు కదిపారు.
దీనిపై రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందించారు. దావోస్‌లో నాటు నాటు స్టెప్ చేసినందున తన తల్లి గర్వించదగిన అత్త అని పేర్కొన్నారు.
2022 మార్చి 24న రిలీజ్ అయిన RRR సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది.
దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.
కేవలం భారత్ లోనే కాకుండా యూఎస్, జపాన్ లోనూ ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు.
అలానే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంటోంది.
అరుదైన అవార్డులు కైవసం..
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి ఇటీవలే బెస్ట్ డైరెక్టర్‌గా ఆర్ఆర్ఆర్ మూవీకి రాజమౌళి అందుకున్నారు.
ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే.
రెండు కేటగిరీల్లో అవార్డ్ కోసం ఈ మూవీ పోటీ పడింది.
బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ పోటీ పడుతుంది.
కాగా తాజాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు.. నాటు’(Naatu Naatu Song) సాంగ్ సత్తా చాటింది. బెస్ట్ సాంగ్ కేటగిరీలో అవార్డును కైవసం చేసుకుంది.
ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ లో భాగంగా ఓటర్స్ కోసం లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ థియేటర్ లో స్క్రీనింగ్ చేశారు.
ఈ సినిమా చూసేందుకు విదేశీయులు ఫుల్ గా ఎగబడ్డారు.
ఏ మూవీకి లేని విధంగా ఈ చిత్రం టికెట్ లు కేవలం ఆన్ లైన్ లో 96 సెకండ్లలోనే అమ్ముడు పోవడం గమనార్హం.
ప్రపంచ సినిమా రంగం లోనే బెస్ట్ ఫిల్మ్ మేకర్ లలో ఒకరిగా ఎంతో గుర్తింపు పొందారు జేమ్స్ కామెరూన్.
టెర్మినేటర్, ర్యాంబో, టైటానిక్, అవతార్ లాంటి లార్జర్ దెన్ లైఫ్ వంటి సినిమాలని ఆయన తెరకెక్కించారు.
అటువంటి దర్శకుడు RRR పై ప్రశంసలు కురిపించారు. ఆ విషయాన్ని తెలుపుతూ.. ట్వీట్ చేశారు రాజమౌళి.
గ్రేట్ జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ ను చూశారు. సినిమా ఆయనకు ఎంతో నచ్చడమే కాకుండా,
ఆ సినిమాను వీక్షించాలంటూ భార్య సుజీకి సూచించి, ఆయన కూడా ఆమెతో కలిసి మరోసారి చూశారు.
మీతో 10 నిముషాలు మాట్లాడుతూ మా సినిమా గురించి అనలైజ్ చేయడం నమ్మలేకపోతున్నాను.
నన్ను వరల్డ్ లో టాప్ అన్నందుకు థ్యాంక్ యు సర్ అని పోస్ట్ చేశారు
.‘నేనిప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ఇద్దరికీ ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు జక్కన్న.
Haha this was fun! @shobanakamineni of Apollo Hospitals says she gets more questions on RRR these days. Ram Charan is her son-in-law https://t.co/NMhfgpW2sX pic.twitter.com/GLcPJdQTjF
— Chandra R. Srikanth (@chandrarsrikant) January 17, 2023