Site icon Prime9

Ram charan: తెలంగాణ దశాబ్ధి ఉత్పవాలపై రాంచరణ్ ట్వీట్

Ram charan

Ram charan

Ram charan: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ధి ఉత్పవాలను రాష్ట ప్రభుత్వం ఘనంగా జరుపుకుంటోంది. ప్రత్యేక కార్యక్రమాలతో రోజుకో రంగం చొప్పున 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఏర్పాటు నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరపున, ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే విధంగా కేంద్రం తరపున బీజేపీ సర్కారు గోల్కోండ కోటలో అధికారంగా ఉత్పవాలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణ ఆవిర్భావ క్రెడిట్ దక్కించుకునేందుకు దశాబ్ది ఉత్సవాల భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.

 

అన్ని రంగాలలో అభివృద్ధి(Ram charan)

మరోవైపు తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్ల సందర్భంగా సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ట్విటర్‌ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాడు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు’ అని రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశాడు.

 

గేమ్ చేంజర్ గా(Ram charan)

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పొలిటికల్ డ్రామాగా వస్తోంది. చరణ్ జతగా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లోపు పూర్తి చేస్తా మంటూ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

 

Exit mobile version