Site icon Prime9

The India House : మెగా పవర్ స్టార్ బ్యానర్ లో నిఖిల్ కొత్త మూవీ స్టార్ట్.. “ది ఇండియా హౌస్” పేరుతో !

ram charan producing movie on nikhil as hero titled as the india house

ram charan producing movie on nikhil as hero titled as the india house

The India House : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యూవీ క్రియేషన్స్ విక్రమ్ రెడ్డి కలిసి ప్రారంభించిన కొత్త ప్రొడక్షన్ హౌజ్..  ‘వీ మెగా పిక్చర్స్’. ముందుగా అనుకున్న విధంగానే ఈ నిర్మాణ సంస్థ నుంచి పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశారు. అయితే అంతా భావించినట్టు అక్కినేని అఖిల్ తో కాకుండా తమ ఫస్ట్ మూవీని యంగ్ హీరో నిఖిల్ తో చేయనున్నట్లు ప్రకటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘ది ఇండియా హౌజ్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీ స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కునున్నట్లు అర్ధం అవుతుంది.

నేడు సావర్కర్ 140 వ జయంతి సందర్భంగా.. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. రామ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నిఖిల్.. శివ అనే పాత్రలో నటిస్తుండగా..  అనుపమ్ ఖేర్ ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ మేరకు తాజాగా రిలీజ్ చేసన వీడియో ని గమనిస్తే.. 1905 సంవ‌త్స‌రంలో బ్రిట‌న్ రాజధాని లండ‌న్‌లో జరిగిన ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారని సమాచారం అందుతుంది. స్వాతంత్య్ర ఉద్య‌మానికి ఆజ్యం పోసిన ఘ‌ట‌న‌ల స‌మాహారంగా ఈ మూవీ రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

 

ది ఇండియా హౌజ్ చరిత్ర..  

1905 – 1910 మధ్య కాలంలో ఉత్తర లండన్‌ లోని.. హైగేట్‌ లోని క్రోమ్‌వెల్ అవెన్యూలో ఉన్న విద్యార్థి వసతి భవనం. న్యాయవాది శ్యామ్‌జీ కృష్ణ వర్మ ప్రోత్సాహంతో, బ్రిటన్‌లోని భారతీయ విద్యార్థులలో జాతీయవాద భావాలను పురికొల్పడానికి దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ ఇంగ్లండ్‌లో ఉన్నత చదువుల కోసం వచ్చే భారతీయ యువకులకు స్కాలర్‌షిప్‌లను మంజూరు చేసేది. ఈ భవనం వేగంగా రాజకీయ క్రియాశీలతకు కేంద్రంగా మారింది. ఇది విదేశీ విప్లవ భారత జాతీయవాదానికి అత్యంత ప్రముఖమైనది. వివిధ సమయాల్లో భవనాన్ని ఉపయోగించిన జాతీయవాద సంస్థలను అనధికారికంగా సూచించడానికి “ఇండియా హౌస్” అనే పేరే వాడేవారు. “ది ఇండియన్ సోషియాలజిస్ట్” అనే పత్రికని ఈ హౌజ్ నుంచి నడిపే వారు. శ్యామ్‌జీ కృష్ణవర్మ నిష్క్రమణ తర్వాత, సంస్థకు వినాయక్ దామోదర్ సావర్కర్‌ కొత్త నాయకుడయ్యాడు.

మొత్తానికి భారీ ప్లానింగ్ తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నమోదయ్యాయి. ఇక ఇప్పటికే కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న నిఖిల్ ఈ మూవీతో మరెంత మందిని అలరిస్తాడో చూడాలి. గ్యారీ బి.హెచ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం ప్రస్తుతం స్పై అనే సినిమా చేస్తున్నాడు నిఖిల్. థ్రిల్ల‌ర్ మూవీగా.. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌కి సంబంధించిన క‌థాంశంతో రూపొందుతోంది.  షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 29న రిలీజ్ కానుంది.

 

Exit mobile version