Site icon Prime9

Ram Charan: బాలీవుడ్ దర్శకులతో రామ్ చరణ్ చర్చలు

Ram Charan: మెగావవర్ స్టార్ రామ్ చరణ్ ’ఆర్ఆర్ఆర్‘ చిత్రంలో తన నటనా నైపుణ్యానికి చాలా ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రం తరువాత చరణ్ బాలీవుడ్‌లో చిత్రాలకు సైన్ చేస్తారని చాలా మంది ఆశించారు. అయితే అటువంటిదేమీ లేకుండా అతను ప్రస్తుతం శంకర్ సినిమా మాత్రమే చేస్తున్నాడు.

శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే తదుపరి తెలుగు సినిమాపై సరైన క్లారిటీ లేకపోయినా, ఇప్పుడు మరోసారి స్ట్రెయిట్ హిందీ సినిమా చేయనున్నట్టు సమాచారం. తన కెరీర్ ప్రారంభంలో, రామ్ చరణ్ జంజీర్ రీమేక్‌ తూఫాన్ లో నటించాడు అయితే ఈ చిత్రం విమర్శకులను మెప్పించలేకపోయింది. కానీ ’ఆర్ఆర్ఆర్‘ తరువాత హిందీ బెల్ట్ లో ప్రేక్షకులు రామ్ చరణ్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారని టాక్. దీనితో దర్శకుడు రోహిత్ శెట్టి అతనిని పోలీసు ప్రధాన పాత్రగా ఉండే సినిమాకు సంప్రదించినట్లు సమాచారం.

మరోవైపు అమీర్ ఖాన్ క్యాంప్‌లో పనిచేసి అరంగేట్రం చేస్తున్న కొత్త దర్శకుడితో కూడ చరణ్ చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే మెగా హీరో ఏ బాలీవుడ్ మేకర్‌కు సంతకం చేయలేదు లేదా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంతర్గత వర్గాలు వెల్లడించాయి. అయితే చర్చలు మాత్రమే జరిగాయని తెలిపాయి. మరి కొద్ది రోజుల్లో వీటి పై క్లారిటీ వచ్చే అవకాశముంది.

Exit mobile version