Game Changer Collections Controversy : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. లార్జర్ దేన్ లైఫ్ సినిమాలకు కేరాఫ్ అయిన శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కడం, ఇదే ఆయన తొలి స్ట్రయిట్ మూవీ కావడంలో ముందు నుంచే విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. పైగా ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన మూవీ కావడంలో అంచనాలు ఎక్కువ అయ్యాయి. శంకర్ చరణ్ కోసం ఎలాంటి థీమ్ రెడీ చేశాడు, రామ్ చరణ్‌కు ఎలాంటి ఎవలివేషన్స్ ఇచ్చాడు అంటూ మెగా అభిమానులంతా అంచనాల్లో మునిగిపోయారు.
ప్రచార పోస్టర్స్, లీకైన వీడియోలు కూడా మూవీపై మంచి బజ్ పెంచాయి. ఇక గేమ్ ఛేంజర్ బ్లాక్‌బస్టర్ మాత్రమే రికార్డు మీద రికార్డు కొడుతుందని ఫ్యాన్స్ అంతా క్యూరియాసిటిగా వెయిట్ చేశారు. ఇక ఇండియన్ 2 ఫలితం తర్వాత గేమ్ ఛేంజర్ విషయంలో ఆందోళన మొదలైంది. ఇండియన్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్, మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటో అని క్రిటిక్స్ నెగిటివ్ ప్రచారం చేశాయి. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్‌పై కాస్తా హైప్ తగ్గింది. అయితే రిలీజ్ వరకు ఒపికగా ఎదురుచూశారు ఫ్యాన్స్. భారీ అంచనాల మధ్య జనవరి 10న గేమ్ ఛేంజర్ థియేటర్‌లో విడుదలైంది. అంతా భయపడ్డంటే మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది.
రామ్ చరణ్ యాక్టింగ్, పర్ఫామెన్స్ నెక్ట్స్ లెవల్, కానీ ఔట్ డేటెడ్ కథ, కథనం వల్ల మూవీకి ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయింది. ఒక గ్లోబల్ స్టార్, శంకర్ సినిమా కాదని, ఆ రేంజ్‌లో లేదనేది ప్రేక్షకులు అభిప్రాయం. శంకర్ చరణ్ ఓ భారీ డిజాస్టర్ ఇచ్చాడని ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్ అంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ షో నుంచి గేమ్ ఛేంజర్ డివైడ్ టాక్ తెచ్చుకుని చివరగా ప్లాప్ టాక్ అందుకుంది. అలాంటి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌ని మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే రూ. 186 కోట్లు పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్టు వెల్లడించారు.
ఇవి చూసి నెటిజన్లతో పాటు సినీవర్గాలు సైతం అవాక్క్ అవుతున్నాయి. బాక్సాఫీసు ట్రాకర్ గణాంకాల ప్రకారం ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 80కోట్లకు పైగా గ్రాస్ చేసినట్టు తెలుస్తోంది. కానీ మేకర్స్ మాత్రం గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్‌ని 186పైగా కోట్ల రూపాయలు అంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఫేక్ కలెక్షన్స్ ప్రకటించిన ప్రజలను మోసం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో గ్లోబల్‌ఫ్రాడ్‌రామ్‌చరణ్ (#GlobalFraudRamCharan) అనే హ్యాష్ ట్యాగ్‌ని వైరల్ చేస్తున్నారు.
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పెద్ద ఫ్రాడ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పుడు లెక్కుల చెప్పోచ్చు కానీ, రూ. 100 కోట్లు వ్యత్యాసం ఉంటుందా? అంటూ గేమ్ ఛేంజర్ టీంపై మండిపడుతున్నారు. మరి మూవీ టీం ఏ లెక్కల ప్రకారం వసూళ్లను ప్రకటించిందనేది క్లారిటీ రావాలి. కానీ ప్లాప్ సినిమాను బ్లాక్‌బస్టర్ అని ప్రకటించుకోవడం సిగ్గుచేటూ అంటూ అంతా మూవీ టీంని తిట్టిపోస్తున్నారు. అయితే కలెక్షన్స్‌లో ట్రాకర్స్ కేవలం థియేటర్లలోని కలెక్షన్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ నిర్మాతలు మాత్రం బిజినెస్, ఇతర ఆదాయాల లెక్కలతో కూడిన మొత్తాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇలాంటి కలెక్షన్ గ్యాప్ సాధారణమైపోయినప్పటికీ, గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం 100 కోట్ల భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. దీంతో గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ సినీ వర్గాలను సైతం ఆలోచింపజేసేలా చేస్తుంది.