Site icon Prime9

Rakul Preet Singh: వచ్చే ఏడాది రకుల్ పెళ్లి.. కన్ఫామ్ చేశావా బ్రో అంటూ ట్వీట్..!

rakul preeth sing tweet on her marriage

rakul preeth sing tweet on her marriage

Rakul Preet Singh: టాలీవుడ్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీ భామ రకుల్. కాగా ఈ స్టార్ హీరోయిన్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతుందంటూ వార్తలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా త‌న సోద‌రి రకుల్, జాకీ చాలా సీరియ‌స్‌గా ఉన్నారని, ఈ ఇద్ద‌రు త‌మ బంధాన్ని 2023లో మ‌రో స్థాయికి తీసుకెళ్ల‌బోతున్నార‌ని ర‌కుల్ సోద‌రుడు అమ‌న్ ట్వీట్ చేశాడు. దానికి పలువురు ర‌కుల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. దానితో రకుల్ స్పందిస్తూ అమ‌న్ నువ్వు కన్ఫామ్ చేశావా.. నా జీవితం గురించి వార్త‌లు నాకే ఎలా తెలియ‌డం లేదంటూ ఫ‌న్నీగా రీ ట్వీట్ చేసింది.

కాగా ర‌కుల్ పెళ్లిపై సోద‌రుడు అమ‌న్ స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్టు తెలుస్తున్నా అదే స‌మ‌యంలో ర‌కుల్ మాత్రం ఫ‌న్నీగా స్పందించ‌డంతో ఈ విష‌యంపై కొంత సస్పెన్స్ నెల‌కొంది. ఇకపోతే ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టుడు, నిర్మాత జాకీ భ‌గ్నానీతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం రకుల్ హిందీ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. ప్ర‌స్తుతం ఆయుష్మాన్ ఖురానాతో క‌లిసి న‌టించిన డాక్ట‌ర్‌ జీ చిత్రం అక్టోబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: నయనతారకు తమిళ ప్రభుత్వం షాక్..!

Exit mobile version