Site icon Prime9

Pushpa 2 Collection: షాకిస్తున్న ‘పుష్ప 2’ కలెక్షన్స్‌ – నాలుగు రోజుల్లోనే రికార్డు బ్రేక్‌ వసూళ్లు, ఎంతంటే!

Pishpa 2 Day 4 Collections: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ వసూళ్ల ఊచకోత ఆగడం లేదు. రోజురోజకు కలెక్షన్స్‌ పెంచుకుంటూ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్‌ బ్రేక్‌ చేసిన ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. కేవలం నాలుగు రోజుల్లోనే ‘పుష్ప 2’ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ చేసి చరిత్ర సృష్టించింది. ఇక నార్త్‌లో అయితే ఏ కలెక్షన్ల సునామీతో ఆల్‌ టైం రికార్డు ఖాతాలో వేసుకుంది. కాగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 5న గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజ్‌కు ముందు రోజు డిసెంబర్‌ 4న ప్రీమియర్స్‌ వేశారు.

బెన్‌ఫిట్‌ షోలతో బాక్సాఫీసు వద్ద పుష్ప 2 విధ్వంసం మొదలైంది. ఇక రిలీజ్‌ తర్వాత బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడమే కాదు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ చేస్తుంది. రూ. 294 కోట్ల గ్రాస్‌తో ఫస్ట్‌డే ఎవరూ ఊహించని భారీ ఒపెనింగ్‌ ఇచ్చి రికార్డుకు ఎక్కింది. ఇక మూడు రోజుల్లోనే రూ. 621 కోట్ల గ్రాస్‌ చేసిన ఈ మూవీ నాలుగో రోజు కూడా డబుల్‌ సెంచరీ చేసింది. దీంతో నాలుగు రోజులకుపుష్ప 2 కలెక్షన్స్‌ రూ. 829 గ్రాస్‌కు చేరింది. ఇక ఇదే జోరు కనబరిస్తే మాత్రం మరో రెండు రోజుల్లోనే పుష్ప 2 వెయ్యి కోట్ల క్షబ్‌లో చేరడం పక్కా. కాగా ఈ వారంతో పుష్ప 2 టికెట్ రేట్స్ కాస్తా తగ్గాయి. మరోవైపు హిందీ బెల్ట్‌లోనూ ఈ మూవీ ఆల్‌ టైం రికార్డు వసూళ్లు రాబట్టింది. ఆదివారం వీకెండ్‌తో కలిసి రూ. 291 కోట్ల నెట్‌ వసూళ్లు చేసింది. దీంతో హిందీలో అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది.

Exit mobile version