Site icon Prime9

నట్టికుమార్: మెగా సినిమాలు ఒకేరోజు రీ రిలీజ్ చేయకూడదనుకున్నాం.. నిర్మాత నట్టికుమార్

Natti Kumar

Natti Kumar

Nattikumar: మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ “గ్యాంగ్ లీడర్” సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తెలిపారు. వాస్తవానికి ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నామని, అయితే అదే రోజు మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన “ఖుషి” సినిమాను రీ రిలీజ్ చేస్తుండటంతో, మెగా కుటుంబ హీరోల సినిమాలను ఒకేసారి పోటీగా విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు నట్టికుమార్ స్పష్టం చేశారు.

దీనితో సంక్రాంతి సినిమాల తర్వాత జనవరి నెలాఖరులో “గ్యాంగ్ లీడర్” రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకు సంబందించిన తేదీని కూడా త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. చాలా ఏళ్ల క్రితం వచ్చిన “గ్యాంగ్ లీడర్” సినిమా అప్పట్లో అభిమానులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని అన్నారు. అందులో చిరంజీవి, విజయశాంతి నటనతో పాటు చక్కటి కథ, కథనాలు, కామెడీ, యాక్షన్ వంటి అన్ని అంశాలు అలరింపజేశాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సినిమాలో పాటలకు చిరంజీవి చేసిన డాన్స్ నేటికీ అభిమానుల కళ్లముందు కదలాడుతోందని నట్టి కుమార్ అన్నారు.

Exit mobile version