Site icon Prime9

Rajini Kanth : జైలర్ సూపర్ సక్సెస్ తో సూపర్‌ స్టార్‌ కి సర్ ప్రైజ్ గిఫ్ట్, చెక్ ఇచ్చిన నిర్మాత కళానిధి మారన్

producer kalanidhi maran surprise gifts to super star rajini kanth

producer kalanidhi maran surprise gifts to super star rajini kanth

Rajini Kanth :  సూపర్ స్టార్ రజినీకాంత్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “జైలర్”. ఈ సినిమా సూపర్ స్టార్ కి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం 600 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. చాలా రోజుల తర్వాత రజినీ తన స్టామినా ఏంటో చూపించారని చెప్పాలి. రజినీ సినిమా హిట్ కొడితే ఆ మోత ఏ రేంజ్‌లో ఉంటుందో చాటి చెప్పాడు.

నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన `జైలర్‌` చిత్రం ఇప్పటికే ఐదు వందల కోట్లు దాటి, ఆరు వందల కోట్ల దిశగా పరుగెడుతుంది. ఆ సినిమా కలెక్షన్లని అడ్డుకునే సినిమా ఇంకా రాలేదు. దీంతో కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఈ నేపథ్యంలో నిర్మాత కళానిధి మారన్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. సక్సెస్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తున్నారు. టీమ్‌కి గిఫ్ట్ లిస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. దర్శకుడు నెల్సన్‌కి రోల్స్ రాయ్స్ కారుని గిఫ్ట్ గా ఇచ్చినట్టు సమాచారం. ఇక తన హీరో రజనీకాంత్‌కి మాత్రం సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌ లు ఇచ్చారు.

 

ఇక ఇప్పటికే ఈ సినిమాకి రజినీ భారీ పారితోషికం తీసుకున్నారని వినిపిస్తుండగా తాజాగా మరో భారీ మొత్తాన్ని రజినీ (Rajini Kanth) కి కానుకగా ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. దీంతో ఇప్పుడు అత్యధిక పారితోషికం అందుకున్న స్టార్‌గా నిలిచారు సూపర్ స్టార్. అంతే కాకుండా సూపర్‌ స్టార్‌కి కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. రెండు బీఎండబ్ల్యూ కార్లని రజనీకాంత్‌ ఇంటికి తీసుకొచ్చిన నిర్మాత కళానిధి మారన్‌.. అందులో ఏది నచ్చిందో సెలక్ట్ చేసుకోమని ఆఫర్‌ ఇచ్చారు. దీంతో తనకు కంఫర్ట్ గా ఉండే బీఎండబ్ల్యూ ఎక్స్ 7 కారుని రజనీ తీసుకున్నారు. దీని విలువ కోటిన్నరగా ఉండటం విశేషం.

 

Exit mobile version