Site icon Prime9

Salaar Movie : ప్రభాస్ “సలార్” మూవీ వాయిదా.. మేకర్స్ అఫిషియల్ అనౌన్స్ మెంట్ !

prabhas salaar movie makers announce on release date postpone

prabhas salaar movie makers announce on release date postpone

Salaar Movie : పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం “సలార్”. ఈ సినిమాలో శృతి హాసన్ ప్రభాస్ కు జంటగా నటిస్తుండగా.. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. `కేజీఎఫ్‌`ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తుండటం విశేషం. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ మిగల్చడంతో అభిమానులంతా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నారు.

కాగా గత కొంత కాలంగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలోనే పలు సినిమాలు కూడా ఆ రిలీజ్ డేట్ కి తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి కాలేదని, సీజీ వ‌ర్క్ ఇంకా అవ్వలేదని అందుకే సినిమా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ సమాచారం. చిత్రయూనిట్ ఇన్నాళ్లు అధికారికంగా స్పందించకపోయినా స‌లార్ సినిమా సెప్టెంబ‌ర్ 28కి విడుద‌ల కావ‌డం లేద‌ని, వాయిదా పడిందని అందరికి క్లారిటీ వచ్చేసింది. అందుకే సలార్ వాయిదా పడిందా లేదా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది చెప్పాలంటూ ప్రభాస్ అభిమానులు చిత్రయూనిట్ ని కోరుతున్నారు. తాజాగా ఈ అంశంపై మూవీ యూనిట్ నోరు విప్పింది.

సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ అకౌంట్ లో సలార్ వాయిదాపై టీం ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో.. సలార్ సినిమాకు సపోర్ చేస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు. పలు కారణాల వల్ల సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కావట్లేదు. అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాము. మీకు మరింత మంచి సినిమాటిక్ అనుభవం అందించడానికి మా చిత్రయూనిట్ కష్టపడుతుంది. సలార్ కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తాము అని ప్రకటించారు.

 

Exit mobile version