Site icon Prime9

Kannappa: ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్‌ లుక్‌ వచ్చేసింది – డార్లింగ్‌ పాత్ర ఏంటో తెలుసా?

Prabhas First Look Poster: డార్లింగ్‌ ఫ్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడాని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ అప్‌డేట్‌ వచ్చేసింది. మంచు విష్ణు డ్రిం ప్రాజెక్ట్‌ కన్నప్పలో ప్రభాస్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఆయన లుక్‌ రిలీజ్‌ చేసింది మూవీ టీం. కాగా మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మంగా మోహన్‌ బాబు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రీల్‌ 25న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మూవీ నిర్మాణ పనులతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో బిజీగా ఉంది టీం. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కన్నప్ప టీం ఈ చిత్రంలో నటీనటుల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేస్తూ వస్తోంది. ఇప్పటికే కాజల్‌ అగర్వాల్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌ లాల్‌, శరత్ కుమార్‌లతో పాటు పలువురి లుక్‌ని రిలీజ్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని ఖుషి చేశారు.

దీంతో ప్రభాస్‌ లుక్‌ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారందరి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ తాజాగా ప్రభాస్‌ లుక్‌తో పాటు ఆయన పాత్రను రివీల్ చేసింది మూవీ టీం. ఇందులో ప్రభాస్‌ రుద్ర ప్రాతలో కనిపించబోతున్నాడు. ప్రభాస్‌ లుక్‌ని రిలీజ్‌ చేస్తూ “ప్రళయ కాల రుద్రుడు, త్రికాల! మార్గదర్శకుడు!! శివాజ్ఞా పరిపాలకుడు!!!” అంటూ పోస్టర్‌పై రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. మహాకవిగా ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ మూవీకి అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version