Site icon Prime9

Salaar Movie Update: సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్

Salaar

Salaar

Tollywood: పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ మరియు కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్ . అటు అభిమానులు, ఇటు పరిశ్రమలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబరులో ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం షూటింగ్ పార్ట్‌లు పూర్తవుతాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా సలార్ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఈరోజు ప్రకటన చేశారు.

సలార్‌ను రెండు భాగాలుగా విడుదల చేస్తారని ఊహాగానాలు ఉన్నాయి, కానీ నిర్మాతలు ప్రస్తుతానికి దీనిపై స్పందించలేదు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్ డాన్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఎక్కువ భాగం హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లో చిత్రీకరించారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, హోంబాలే ఫిలింస్ నిర్మాతలు. ప్రభాస్ ప్రస్తుతం విరామంలో ఉన్నాడు. వచ్చే నెలనుంచి అతను సలార్ మరియు ప్రాజెక్ట్ కె చిత్రాల షూటింగ్ లో పాల్గొంటాడు.

Exit mobile version