Site icon Prime9

Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్లో గూస్ బంప్స్ గ్యారంటీ

prabhas adipurush trailer released and got trending on youtube

prabhas adipurush trailer released and got trending on youtube

Adipurush :  బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం “ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సుమారు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. రామాయణం ఆధారంగా ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో, ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురుకున్న చిత్ర యూనిట్ అవన్నీ సరి చేసుకొని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.

అయితే, కిందటేడాది అక్టోబర్‌లో విడుదలైన ‘ఆదిపురుష్’ టీజర్ ఆ అంచనాలన్నింటినీ తారుమారు చేసింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పై భారీగా ట్రోలింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ వరకు వాయిదా వేశారు. 3డీ తోపాటు.. వీఎఫ్ఎక్స్ లోనూ పలు మార్పులు చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. నేడు (మే 9) ఈ మూవీ ట్రైలర్ ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని 2D అండ్ 3D ఫార్మాట్స్ లో రిలీజ్ చేయగా.. 3D ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం 5:04 నిమిషాలకు దేశ వ్యాప్తంగా పలు థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు.

అహంకారపు రొమ్ము చీల్చడానికి దూకండి అంటూ Adipurush..

ఇక రామాయణం గాధని తెలుపుతూ ఇప్పటి వరకు పలు భాషల్లో వందల చిత్రాలు తెరకెక్కాయి. కొన్ని సంపూర్ణ రామాయణాలు కాగా మరికొన్ని రామాయణంలోని ప్రధాన ఘట్టాల ఆధారంగా తెరకెక్కాయి. అయితే ఈ ట్రైలర్ ని గమనిస్తే హనుమంతుని పాయింట్ ఆఫ్ వ్యూలో “ఆదిపురుష్” సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గ్రాండియర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా ఆదిపురుష్ ట్రైలర్ ఉంది. రాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ మెస్మరైజ్ చేసేలా ఉన్నారు. ట్రైలర్ మధ్యలో.. అహంకారపు రొమ్ము చీల్చడానికి దూకండి ముందుకి” అని.. నా ప్రాణం సీతలోనే ఉంది
నాకు ప్రాణాలకన్నా మర్యాదే అధిక ప్రిమయమైనది అని ప్రభాస్ చెప్పిన డైలాగ్లు గూస్ బంప్స్ తెచ్చే రేంజులో ఉన్నాయి. ట్రైలర్ చివరిలో సైఫ్ అలీ ఖాన్ లుక్ ని రివీల్ చేశారు, రావణ బ్రహ్మగా సైఫ్ అలీ ఖాన్ బాగా సూట్ అయ్యారు. ఇక ఈ ట్రైలర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి. జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అనే చాంటింగ్ వస్తుంటే.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. మొత్తానికి అయితే ఇన్నాళ్ళూ ట్రోల్స్ దెబ్బకి షేక్ అయిన ఈ మూవీ యూనిట్ అంతా ఇప్పుడు అభినందనలతో మునిగిపోతున్నారు. ఇక ట్రైలర్ అయితే అన్ని భాషల్లో ట్రెండింగ్ గా దూసుకుపోతూ నెక్స్ట్ లెవెల్లో రికార్డులు తిరగరాస్తుంది.

 

Exit mobile version