Site icon Prime9

Prabhas Adipurush: విజువల్స్ వండర్ గా ఆదిపురుష్ టీజర్.. అస్సలు బాలేదంటున్న ఫ్యాన్స్

adipurush teaser out

adipurush teaser out

Prabhas Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన ‘ఆది పురుష్‌’టీజర్‌ వచ్చేసింది.  రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కనున్న ఈ సినిమా టీజర్‌ను అయోధ్యలో ఆదివారం సాయంత్రం మూవీ యూనిట్ విడుదల చేసింది.

1.40 నిమిషాల నిడివి ఉన్న ఆదిపురుష్ టీజర్ వీడియో ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది. రాముడి లుక్‌లో ప్రభాస్‌ అదరగొట్టారు. ఇక నీళ్లలో తపస్సు చేస్తూ ప్రభాస్ కనిపించిన సన్నివేశమైతే సినిమాపై భారీ అంచనాలు పెంచేసిందనుకోండి. దర్శకుడు ఓంరౌత్‌ చెబుతున్నట్టే ఈ సినిమా విజులవ్‌ వండర్‌గా ఉండనుందని టీజర్‌ చూస్తే స్పష్టం అవుతుంది. ఈ చిత్రంలో లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్, సీతగా కృతి సనన్‌, హనుమంతుడిగా దేవదత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌ చాలా అద్భుతంగా నటించారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించబడిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఆదిపురుష్ సినిమా టీజర్ పై అటు కామన్ ఆడియన్స్, ఇటు కొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. యానిమేటెడ్ లా ఉందని, వీఎఫ్ ఎక్స్ అస్సలు బాలేదని పలువురు సినీలవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. నార్మల్ సినిమానా లేదా బొమ్మల సినిమానా అనే సందేహపడుతున్నారు. మరి ఈ టీజర్ పై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.

ఇదీ చదవండి: పెళ్లిపీటలెక్కనున్న ప్రముఖ యాంకర్

Exit mobile version