Site icon Prime9

Adipurush Pre Release Event : ప్రభాస్ “ఆదిపురుష్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లేస్ ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే??

prabhas adipurush-pre-release-event-place and time fixed

prabhas adipurush-pre-release-event-place and time fixed

Adipurush Pre Release Event : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “ఆదిపురుష్“. ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్ గా తెరకెక్కుతున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సుమారు 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది.

అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో.. మూవీ ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచారు. ఈ మేరకు జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ (Adipurush Pre Release Event) ఈవెంట్ ని తిరుపతిలో నిర్వహించబోతున్నారు. అందుకు గాను ట్విట్టర్ వేదికగా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా తిరుపతి లోనే నిర్వహించారు. దాంతో ఇప్పుడు ఈ ఈవెంట్ ని అదే ప్లేస్ లో ఏర్పాటు చేస్తుండడంతో బాహుబలి సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందేమో అని అభిమానులు మంచిగా ఫీల్ అవుతున్నారు. బాహుబలి లాగా ఆదిపురుష్ కూడా నెక్స్ట్ లెవెల్ హిట్ అందుకోవాలని రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా బలంగా కోరుకుంటున్నారు. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అన్న విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మరోవైపు యూఎస్ కి సంబంధించిన ఈ మూవీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే అధిక స్థాయిలో టికెట్స్ కూడా అమ్ముడు పోయినట్లు సమాచారం అందుతుంది.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో, ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి.  అంతకు ముందు ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు.. వీఎఫ్ఎక్స్ పై భారీగా ట్రోలింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ వరకు వాయిదా వేశారు. 3డీ తో పాటు.. వీఎఫ్ఎక్స్ లోనూ పలు మార్పులు చేశారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలన్నింటినీ మార్చేసింది. ట్రైలర్ లో.. అహంకారపు రొమ్ము చీల్చడానికి దూకండి ముందుకి, నా ప్రాణం సీతలోనే ఉంది.. నాకు ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రిమయమైనది అని ప్రభాస్ చెప్పిన డైలాగ్లు గూస్ బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అనే చాంటింగ్ వస్తుంటే.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అనే చెప్పాలి. త్వరలోనే ఈ చిత్రంలోని మరో సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version
Skip to toolbar