Site icon Prime9

Ponniyin Selvan Collections: తమిళ సినీ చరిత్రలోనే మొదటి సారి.. పొన్నియన్ సెల్వన్ కలెక్షన్ల ప్రభంజనం..!

ponniyin selvan first day collections

ponniyin selvan first day collections

Ponniyin Selvan Collections: లెజండరీ డైరెక్టర్‌ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించినబడిన పొన్నియన్ సెల్వన్-1 మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లతో దూసుకుపోతుంది. సౌత్ నార్త్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పొన్నియన్‌ సెల్వన్ 30 సెప్టెంబర్ 2022న విడుదలై ఘన విజయం సాధించింది.  ఈ సినిమాను కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా మణిరత్నం తెరకెక్కించాడు. ఈ సినిమాలో చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహా వంటి భారీ తారాగణం నటించడంతో విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.

మరి ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లను చూస్తే:
తమిళనాడు : 25.85 కోట్లు
తెలంగాణ మరియు ఏపి : 5.50 కోట్లు
కర్ణాటక : 4.05 కోట్లు
కేరళ : 3.20 కోట్లు
ఇతర దేశాల్లో: 2.60 కోట్లు
ఓవర్సీస్‌ : 39.10 కోట్లును రాబట్టింది

ఇక ప్రపంచ వ్యాప్తంగా: రూ. 80.30 కోట్లు( 41.80 కోట్లు షేర్‌) వసూళ్లను రాబట్టింది.

‘పొన్నియన్‌ సెల్వన్‌-1’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల వరకు థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. కాగా మొదటి రోజు ఈ సినిమా రూ. 41.80 కోట్ల వరకు సాధించింది. తమిళ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా పొన్నియన్‌ సెల్వన్‌-1 చరిత్రకెక్కింది. ఇదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతే పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రం త్వరలోనే బ్రేక్‌ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాటలో పయనిస్తుందని చెప్పవచ్చు.


ఇదీ చదవండి: నాని దసరా.. “ధూమ్ ధామ్ దోస్తాన్” పాట రిలీజ్ ఎప్పుడంటే..?

Exit mobile version