Site icon Prime9

Allu Arjun: అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు

Complaint on Allu Arjun

Complaint Filed On Allu Arjunn: హీరో అల్లు అర్జున్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ పుష్ప 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో దేశమంత చూట్టేస్తున్నాడు. అయితే ఈ కార్యక్రమాల్లో ఎక్కడికి వెళ్లిన తన ఫ్యాన్సిని ఉద్దేశిస్తూ ఆర్మీ అని పేర్కొంటున్నాడు. మై ఆర్మీ.. అల్లు ఆర్మీ అంటూ ఫ్యాన్స్‌ గురించి చెబుతున్నాడు. ఈ క్రమంలో ఆర్మీ ఆనే పదం వాడటంపై పలువురి నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై సికింద్రాబాద్‌ మల్కాజ్‌గిరిలో పరిధిలోని జవహర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేశారు.

ఈ అల్లు అర్జున్‌ తన అభిమానులను ఆర్మీ అని పిలుస్తున్నాడు. ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరు. దీనిని తన అభిమాన సంఘానికి పెట్టుకోని ఆర్మీ అని పిలుస్తున్నాడు. దేశ రక్షణ కోసం బార్డర్‌లో ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేసే వారిని మనం ఆర్మీ అంటామని, అటువంటి ఆర్మీ అనే పదానికి గౌరవం అల్లు అర్జున్‌ గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎటువంటి నియమ నిబంధనలు పాటించడం లేదని, అందువలన అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్‌ గౌడ్‌ శుక్రవారం జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. మరి దీనిపై అల్లు అర్జున్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తిని సంతరించుకుంది. అయితే త్వరలోనే ఆయన పుష్ప 2 మూవీ రిలీజ్‌ ఉండగా.. తాజాగా బన్నీ లీగల్‌ వివాదంలో చిక్కుకోవడం అభిమానులను కలవరబెడుతుంది. కాగా క్రియేటివ్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నవీన్‌ యర్నేనీ, రవిశంకర్‌ యలమంచిలిలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళ స్టార్‌ హీరో ఫహాద్‌ ఫాజిల్‌, జగపతిబాబు, సునీల్‌, రావు రమేష్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version