Pawan kalyan: మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’ ( BRO Movie). మామా అల్లుళ్ళు మొదటిసారి కలిసి సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాకు డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కాగా తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’ కి ఇది రీమేక్ గా వస్తుంది. ఇక ఇటీవల ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పవన్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది.
ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ లుక్ ని కూడా రివీల్ చేసి మెగా ఫ్యాన్స్ అందరికీ మంచి ట్రీట్ ఇచ్చారు. కాగా, తాజాగా డబుల్ బొనాంజా ట్రీట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లుక్ లను విడివిడిగా రిలీజ్ చేయగా.. తాజాగా ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని సోషల్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఇద్దరూ పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. స్టైలిష్ లుక్స్ లో మామాఅల్లుళ్లు మెస్మరైజ్ చేశారు. జూన్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
స్పెషల్ అట్రాక్షన్ గా ‘షూ’ (Pawan kalyan)
కాగా, ఈ పోస్టర్ పవన్ కళ్యాణ్ వేసుకున్న ‘షూ’ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. చూడటానికి ఎంతో వెరైటీగా ఉండటంతో ఫ్యాన్స్, నెటిజన్స్ దృష్టి వాటిపై పడింది. దీంతో ఆ షూ వివరాలు, ధర గురించి ఆన్‌లైన్‌లో వెతికారు. పవన్ కళ్యాణ్ వేసుకున్న ఆ షౌ బ్రాండ్, ధర చూసి అందరూ అవాక్కువుతున్నారు. పారిస్‌కు చెందిన ప్రముఖ కంపెనీ బాల్మేన్ ఈ షూ ని తయారు చేసింది. బ్రో సినిమా కోసం ప్రత్యేకంగా పవన్ కోసమే ఇవి మూడు జతలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈ షూ ధరెంతో తెలుసా. ఒక జత రూ. లక్ష రూపాయలు.