Hari Hara Veeramallu First Song Promo: పవర్ స్టార్ పవన కళ్యాణ్ అభిమానుల సంక్రాంతి పండుగ సర్ప్రైజ్ ఇచ్చింది హరి హర వీరమల్లు టీం. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇస్తూ ప్రొమో రిలీజ్ చేసింది. ఎంతో కాలంగా ఆయన అభిమానులంత పవన్ సినిమాల అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా హరి హర వీరమల్లులో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన మూవీ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ సాంగ్ ప్రొమో రిలీజ్ చేశారు. ఇందులో పవన్ వాయిస్ తో ఉన్న డైలాగ్ వరకు సాంగ్ ప్రొమో వదిలారు.
కేవలం 16 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రొమోలో పవన్ డైలాగ్ మాత్రమే ఉంది. ‘వినాలి.. వీరమల్లు మాట వినాలి..’ అంటూ పవన్ ఇంటెన్స్ వాయిస్ తో చెప్పిన డైలాగ్ తో ప్రొమో ముగిసింది. ఫుల్ సాంగ్ ను జనవరి 17న ఉదయం 11 గంటల 20 నిమిషాలకు విడుదల చేస్తామని మూవీ టీం స్పష్టం చేసింది. ఈ అప్డేట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల ఫస్ట్ మూవీ ఇది. దీంతో హరి హర వీరమల్లుపై భారీ అంచనాలు నెలకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ లో చివరి షెడ్యూల్ ని మొదలుపట్టినట్టు మూవీ టీం ప్రకటించింది. ఇది క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అని, ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాలోని ముఖ్య తారాగణం కూడా పాల్గొననుందని తెలిపారు. 200 మంది ఆర్టిస్టులతో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న తెలుస్తోంది. కాగా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ పోరాట యోధుడిగా కనిపించనున్నాడు. 18వ శతాబ్ధం కాలం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం సాగనుంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.