Site icon Prime9

Bro Movie : సర్ ప్రైజ్ గా డబుల్ బొనాంజా గిఫ్ట్ ఇచ్చిన మామా అల్లుళ్ళు.. బ్రో మూవీ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ !

pawan kalyan and sai tej poster released from bro movie

pawan kalyan and sai tej poster released from bro movie

Bro Movie : మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో” ( BRO Movie ). మామా అల్లుళ్ళు కలిసి మొదటిసారి ఒక సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కాగా తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుంది. ఇక ఇటీవల ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పవన్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ తరువాత సాయి ధరమ్ లుక్ ని కూడా రివీల్ చేసి మెగా ఫ్యాన్స్ అందరికీ మంచి ట్రీట్ ఇచ్చారు. కాగా ఇప్పుడు తాజాగా డబుల్ బొనాంజా ట్రీట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్.

ఇప్పటికీ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లుక్ లను విడివిడిగా రిలీజ్ చేయగా ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేడియకగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఇద్దరూ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. స్టైలిష్ లుక్స్ లో ఇద్దరూ మెస్మరైజ్ చేస్తున్నారు. ఫోటోని రిలీజ్ చేసి కొద్ది సేపే అవుతున్నప్పటికి అంతలోనే సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఇలాంటి తరుణంలో వారు ఎలాంటి యుఫోరియా క్రియేట్ చేస్తారో అర్దం చేసుకోవచ్చు.

ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలానే ఈ సినిమాలో కేతిక శర్మ.. సాయి ధరమ్ కి జోడిగా కనిపించబోతుందని తెలుస్తుంది. అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ చెల్లి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే పవన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యిపోయిన సంగతి తెలిసిందే. అయితే పవన్ పై ఒక సాంగ్ బ్యాలన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని జులై 28న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.

కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది ‘వినోదయ సీతమ్’ సినిమా స్టోరీగా తెలుస్తుంది. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేయనుండగా.. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. దీంతో పవన్ దేవుడి పాత్రలో నటించడం ఇది రెండోసారి అవుతుంది. అంతకు ముందు విక్టరీ వెంకటేష్ తో కలిసి చేసిన ‘గోపాల గోపాల’లో.. పవన్ మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. కానీ,అందులో కూడా మోడ్రన్ దేవుడిలానే దర్శనమిచ్చాడు. ఈ మూవీతో మామ – అల్లుళ్ళు ఏ రేంజ్ లో అలరిస్తారో చూడాలి.

Exit mobile version