Site icon Prime9

Pankaj Tripathi: మాజీ ప్రధాని వాజ్‌పేయి పాత్రలో పంకజ్ త్రిపాఠి

Bollywood: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్‌ను బాలీవుడ్ నిర్మాత వినోద్ భానుశాలి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అటల్ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం వాజ్‌పేయి బాల్యం నుండి ఆయన రాజకీయ జీవితం వరకు సాగిన ప్రయాణాన్ని తెలియజేస్తుంది.

ఈ చిత్రం 2023 ప్రారంభంలో సెట్స్‌పైకి రానుంది. ఇది ఉల్లేఖ్ ఎన్‌పి రాసిన “ది అన్‌టోల్డ్ వాజ్‌పేయి: పొలిటీషియన్ అండ్ పారడాక్స్” అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. 2023 క్రిస్మస్ నాడు వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు కూడా తెలిపారు.

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి వాజ్‌పేయి పాత్రలో నటిస్తారు.గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, స్ట్రీ, లూడో, గుంజన్ సక్సేనా, మిమీ వంటి చిత్రాలలో తన నటనతో పంకజ్ ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ వార్తపై ఇంకా అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ లేదు.

Exit mobile version