Site icon Prime9

Salaar : మాస్ అరాచకం చూపించిన ప్రభాస్ “సలార్” టీజర్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా

pan india star prabhas salaar movie teaser released

pan india star prabhas salaar movie teaser released

Salaar : సమయం ఉదయం 5; 12 నిమిషాలు.. సాధారణంగా ఒకప్పుడు ఈ సమయానికి నిద్ర లేచి.. పనులు ప్రారంభించేవారు.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప ఆ టైమ్ కి లేవరు.. ఇక ముఖ్యంగా మన జనరేషన్ కుర్రాళ్ల గురించి చెప్పాల్సిన పనేలేదు. కానీ ఈరోజు ఉదయాన్నే 5 గంటల నుంచి ఎప్పుడు మోగని అలారంలు మోగుతున్నాయ్ అంటే అందుకు ఏకైక కారణం పాన్ ఇండియా స్టార్ “ప్రభాస్”. ఒక సినిమా టీజర్ కోసం నిన్న నైట్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంత ఎదురు చూశారో సోషల్ మీడియా చూస్తేనే అర్ధం అవుతుంది. వాళ్ళందరి ఆశల్ని నిజం చేస్తూ.. రెట్టింపు ఉత్సాహంతో ఇంకొన్ని రోజులు ఎదురు చూసేలా చేశారు ప్రశాంత్ నీల్.     

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం “సలార్”. ఈ సినిమాలో శృతి హాసన్ ప్రభాస్ కు జంటగా నటిస్తుండగా.. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. `కేజీఎఫ్‌`ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ మిగల్చడంతో అభిమానులంతా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి దాకా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్స్ తప్ప మరొక అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో.. ఆకలిగా ఉన్న వ్యక్తికి మంచి విందు భోజనం ఇచ్చాడు నీల్.

 

తాజాగా ఈరోజు ఉదయాన్నే ముందుగానే చెప్పినట్టుగా మన దేశంలో 5: 12 నిమిషాలకు సలార్ (Salaar) టీజర్ ని రిలీజ్ చేశారు. అదిరిపోయే ఎలివేషన్స్, దుమ్మురేపే యాక్షన్ సీన్స్.. గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం.. అన్నింటినీ మించి ఎప్పుడెప్పుడు మళ్ళీ మాస్ అవతార్ లో కనిపిస్తాడా అని చూస్తున్న ఫ్యాన్స్ అందరి ఆశల్ని నిజం చేస్తూ.. కనిపించకుండానే మాస్ ర్యాంపేజ్ చూపించిన ప్రభాస్.. ఇందుకు బోనస్ గా మూవీని రెండు పార్ట్ లుగా తీసుకురావడం.. ఇది చాలు అండి.. ప్రభాస్ ఫ్యాన్స్ కి, సినిమా లవర్స్ కి.. ఇంకా ఈ రేంజ్ లో అన్నీ వచ్చాక ఏం జరుగుతుందో.. అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది.. సలార్ దెబ్బకి సోషల్ మీడియా అంతా షేక్ అవుతుంది.

 

ఇక టీజర్ విషయానికి వస్తే.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి టీజర్ మాత్రం ఒకే భాషలో.. అది కూడా ఇంగ్లీష్ లోనే ఉన్న కొద్ది డైలాగ్ లు ఉండేలా చూసుకున్నారు.  1 నిమిషం 46 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ లో.. ముందుగా సీనియర్ ఆర్టిస్టు టినూ ఆనంద్ తనను చుట్టుముట్టిన గ్యాంగ్ ని ఉద్దేశించి సింహం, చిరుత, పులి, ఏనుగు.. ఇవన్నీ అడవిలో ప్రమాదకరం కానీ జురాసిక్ పార్క్ లో కాదని చెప్తూ ఉండగా.. డైనోసార్ ముందు ఏదైనా తక్కువే అనేలా ప్రభాస్ ఫేస్ ని పూర్తిగా రివీల్ చేయకుండా సైడ్ కట్ తో.. చూపించారు. కత్తులతో, గన్ తో  ప్రత్యర్థులపై వీరంగం సృష్టించారు ప్రభాస్‌. దీనికి తోడు గూస్‌బంమ్స్ తెప్పించే బీజీఎం.. ఇందులో హైలైట్‌గా నిలిచింది. కాగా `కేజీఎఫ్‌` తరహాలోనే టీజర్‌ కూడా బ్లాక్ టోన్ లో ఉండడం గమనార్హం.  ఇదిలా ఉంటే ఈ సినిమా రెండు పార్ట్ లుగా రాబోతుందని ప్రకటించారు మేకర్స్. దీన్ని `పార్ట్ 1ః కాల్పుల విరమణ` అంటూ ప్రకటించారు. టీజర్‌ చివర్లో విలన్‌ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమార్‌ని చూపించడం మరో విశేషం. అయితే కనీసం ప్రభాస్ ని పూర్తిగా రివీల్ చేయకుండా.. ఒక డైలాగ్ కూడా చెప్పించక పోవడం కొంత మేర నిరాశ కలిగిస్తుంది.

 

Exit mobile version