Allu Arjun: అల్లు అర్జున్‌ ఇంటిపై రాళ్ల దాడి

  • Written By:
  • Updated On - December 22, 2024 / 07:04 PM IST

Ou JAC Students at Allu Arjun Home: హీరో అల్లు అర్జున్‌ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి ముందు ఓయూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఆయన ఇంటిపై రాళ్లు విసరడంతో అక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఆదివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తప్పు చేసిన వారిని అరెస్ట్‌ చేస్తే తనని తిడుతున్నారని, ఒక్క రోజు అరెస్ట్‌ అతడికి ఇంటికి సినీ ప్రముఖులంతా వెళ్లి పరామర్శించడానికి క్యూ కట్టారంటూ అసహనం వ్యక్తం చేశారు.

అదే మరణించి మహిళ రేవతి కుటుంబాన్ని ఒక్కరైన పరామర్శించారా? ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితితో ఉన్న ఆమె కుమారుడు చూడటానికి ఆస్పత్రికి వెళ్లారా? అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ వల్ల ఆ ఘటన జరిగిందని సీఎం పేర్కొన్నారు. ఆయన కామెంట్స్‌ అనంతరం అల్లు అర్జున్‌ తన నివాసంలో ప్రెస్‌మీట్‌ పెట్టిన సంగతి తెలిసిందే. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని సీఎం కామెంట్స్‌ని ఖండించారు. ప్రస్తుతం ఈ వ్యవహరం రాష్ట్రంలో సంచలనంగా మారిన నేపథ్యంలో తాజాగా ఆయన ఇంటి వద్ద నెలకొన్న పరిస్థితులు ఆందోళన గురి చేశాయి.

సంధ్య థియేటర్ ఘటనలో రేవతి మృతికి అల్లు అర్జున్‌యే కారణమంటూ ఓయూ జేసీ ఆధ్వర్యంలో పలువురు నిరసన దిగారు. వారందరు ఒక్కసారిగా బన్నీ ఇంటికిలోపలికి వె ళ్లే ప్రయత్నం చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్‌ కారణమే అంటూ నినాదాలు చేశారు. వెంటనే రేవతి కుటుంబానికి కోటీ రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆ సమయంలో కొందరు విద్యార్థు లు అత్యుత్సాహం చూపిస్తూ అల్లు అర్జున్‌ ఇంటిపై రాళ్లు విసరడంతో అక్కవ వాతావరణం మరింత వేడెక్కింది. రాళ్ల వల్ల అల్లు అర్జున్‌ ఇంటి ముందు ఉన్న పూల కుండీలు ధ్వంసం అయ్యాయి. అక్కడికి పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ఇంటి ముందు భారీ పోలీసులు మోహరించారు.