Site icon Prime9

Cobra Movie On OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కోబ్రా.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!

cobra movie on OTT

cobra movie on OTT

Cobra Movie On OTT: తమిళంతో పాటు తెలుగునాట మంచి క్రేజ్ ఉన్న హీరో విక్రమ్. ఈ స్టార్ హీరో ముఖ్య పాత్రలో నటించిన ఇటీవల చిత్రం కోబ్రా. ఈమూవీ ఓటీటీ స్ట్రీమింగ్  డేట్ ను తాజాగా ప్రకటించింది చిత్ర బృందం.

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి జంటగా తెరకెక్కిన చిత్రం కోబ్రా. ఈ మూవీ ఆగస్టు 31న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. వైవిధ్యమైన కథతో రూపొందించిన ఈ సినిమాలో విక్రమ్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పలు రకాల గెటప్స్ లో కనిపించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను కైవసం చేసుకున్నారు.

కాగా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఇది వరకే సోనీ లివ్ భారీ మెుత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా దీనిని సెప్టెంబరు 28న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. దానికి సంబంధించిన కొత్త ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది. అయితే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించినప్పటికీ ఏఏ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో చిత్ర బృందం చెప్పలేదు. కానీ సోనీ లివ్ మాత్రం ఈ చిత్రం తమిళ వర్షన్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ఇదీ చదవండి: Ajith Kumar: 11 ఏళ్ల తర్వాత “అజిత్” నెగెటివ్ రోల్.. వైరలవుతున్న మూవీ పోస్టర్

 

Exit mobile version