Site icon Prime9

Unstoppable-2 Promo: మీకంటే ఎక్కువే రొమాంటిక్ పనులు చేసేవాడిని.. ఆమెకు “ఐ లవ్ యూ” చెప్పిన “చంద్రబాబు”..!

unstoppable season 2 first episode promo

unstoppable season 2 first episode promo

Unstoppable-2 Promo: అన్ స్టాపబుల్ అంటేనే ఒక జోష్ వస్తుంది. ఎందుకంటే అందులో బాలయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు. కాగా ఈ షో మొదటి సీజన్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే కాగా కొద్దిరోజుల్లో రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ కూడా ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోను ఆహా సంస్థ రిలీజ్ చేసింది. బాలయ్య షో కు మొదటి గెస్ట్ గా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. చంద్రబాబు బాలయ్యకు బావ మరియు వియ్యంకుడు కూడా అన్న విషయం తెలిసిందే. ఇక ఈ బావ బామ్మర్దులు కలిసి ఈ టాక్ షోలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటేనే ఈ ఎపిసోడ్ ఎంత సరదాగా సాగిందో అర్ధమవుతోంది. అలాగే ఈ ఎపిసోడ్ లో నారా లోకేష్ కూడా హాజరయ్యారు.

ఆ రోజుల్లో మాములుగుండే వాడిని కాదు.. చంద్రబాబు

ఇక ఈ ప్రోమోలో బాలయ్య మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పండి అని చంద్రబాబు ను అడగ్గా నేను, రాజశేఖర్ రెడ్డి కలిసి బాగా తిరిగాం అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ‘మీ జీవితంలో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి బావా’ అని చంద్రబాబును బాలకృష్ణ అడుగగా దీనికి చంద్రబాబు చెప్పిన సమాధానానికి ప్రజలందరూ ఆశ్చర్యపోతూ మోస్ట్ రొమాంటిక్ చంద్రబాబు అనుకుంటారు. ‘ కళాశాల రోజుల్లో మీకంటే ఎక్కువే రొమాంటిక్ పనులు చేశానని మీరు సినిమాల్లో చేస్తే నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు చేశానంటూ.. అమ్మాయిలు కనిపిస్తే బైక్ సైలెన్సర్ తీసేసి డ్రైవ్ చేసేవాళ్ళమని చంద్రబాబు సమాధానం ఇస్తారు. అలాగే మా చెల్లిని ఏమని పిలుస్తారు బావా మీరు అని బాలయ్య అడగ్గా భూ అని పిలుస్తా అని అంటారు చంద్రబాబు. అలాగే అందరి ముందు చంద్రబాబుతో ఐ లవ్ యూ చెప్పిస్తాడు బాలయ్య. ఇకపోతే లోకేష్‌లను ఉద్దేశిస్తూ తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి తన సంసారంలో నిప్పులు పోయడానికి వచ్చారని బాలకృష్ణ సరదాగా అనడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. అంతేకాక ఈ షోలో పలు పొలిటికల్ పాయింట్స్‌ను కూడా టచ్ చేసినట్లు ప్రోమోను చూస్తే తెలుస్తోంది. మొత్తంగా ఈ ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీ వేదికగా ఈ నెల 14న టెలికాస్ట్ అవ్వనుంది.

బాలయ్య రెమ్యునిరేషన్ ఎంతో తెలుసా.. 

ఇదిలా ఉండగా మరోవైపు ఈ షోకు బాలయ్య తీసుకునే రెమ్యూనరేషన్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్ స్టాపబుల్ సీజన్1 కు బాలకృష్ణ 2.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇక ఆ షో ఘన విజయం సాధించడమే కాక ఆహాకు సబ్‌స్కైబర్స్ ను పెంచిందట. దానితో రెండో సీజన్‌కు బాలయ్యకు ఆరు కోట్ల రూపాయల వరకు ముడుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ఎటువంటి సమాచారం  వెలువడలేదు.

ఇదీ చదవండి: రామ్ చరణ్ భార్యగా అంజలి

Exit mobile version