Site icon Prime9

Unstoppable 2: ప్రభాస్ రాణి ఎవరు?.. అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ సీక్రెట్స్ రివీల్ చేసిన బాలకృష్ణ

prabhas unstoppable with nbk 2 promo

prabhas unstoppable with nbk 2 promo

Unstoppable 2: పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న డార్లింగ్ మొదటి సారిగా ఓటీటీ ప్లాట్ ఫాంపై సందడి చేశారు. అందులోనూ అది మన నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి సరదాసరదాగా గడిపారు.

ఆహా వేదికగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 టాక్ షో ప్రేక్షకులలో ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ టాక్ షో కు సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా పిలిపించి వారితో బాలయ్య చేసే హంగామా అంతా ఇంతాకాదు పంచులు, ఆటలు, పాటలు, సెటైర్లు, ఫన్ ఇలా ఒకటేమిటీ అన్నింటిని కలగలిపి టాక్ షో కా బాప్ అనిపించేలా ఎంటర్టైన్ మెంట్ అందిస్తుంటారు. ఇకపోతే తాజాగా బాహుబలి ఫేమ్ ప్రభాస్.. తన స్నేహితుడు హీరో గోపిచంద్ అన్ స్టాపబుల్ కు వచ్చి రచ్చ రచ్చ చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్ వీరలెవల్లో వీక్షకుల ఆదరణ పొందింది. ఇకదానితో దీనికి సంబంధించి ప్రోమోను ఆహా టీం శనివారం విడుదల చేశారు.

ఇక ఆ ప్రోమో చూస్తే ప్రభాస్ కు సంబంధించిన సీక్రెట్స్ బాలకృష్ణ రివీల్ చేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా డార్లింగ్ పెళ్లి.. కాబోయే వధువు ఎవరో తెలుసుకోవడానికి తెగ ట్రై చేశారు బాలయ్య. ఇక డార్లింగ్ సీక్రెట్స్ లీక్ చేయడంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోన్ కాల్ మరియు అక్కడే ఉన్న గోపిచంద్ హైలెట్ అయ్యారు. రాణి అంటూ ప్రభాస్ ను ఓ ఆటాడుకున్నారు గోపీచంద్, బాలకృష్ణ. బయట ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే డార్లింగ్ అన్ స్టాపబుల్ షోలో మాత్రం ఎంతో సరదాగా.. అల్లరి అల్లరిగా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
నిన్న రిలీజ్ చేసిన ఈ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ ప్రోమో విడుదలైన గంటలోనే దాదాపు 2 మిలియన్ వ్యూస్ వచ్చినట్లుగా మేకర్స్ పేర్కొన్నారు. ఇక ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూయర్ కానుకగా డిసెంబర్ 30న ప్రభాస్, గోపిచంద్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా టీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. గోపిచంద్, ప్రభాస్ స్నేహం వర్షం సినిమాతో మొదలైంది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో వర్షం చిత్రం ఒకటి. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా, గోపిచంద్ విలన్ గా నటించారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.

ఇదీ చదవండి: ఎండ్ కార్డ్ పడనున్న బిగ్ బాస్ సీజన్ 6… విన్నర్ అతడేనా?

Exit mobile version