Site icon Prime9

Karthikeya-2 on OTT: ఓటీటీలో కార్తికేయ-2… ఈ నెల 30 నుంచే..!

Karthikeya-2 now streaming on Ott

Karthikeya-2 now streaming on Ott

Karthikeya-2 on OTT: టాలీవుడ్ లో కార్తికేయ-2 హవా కొనసాగుతుంది. యంగ్ డైనమిక్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా గత నెల 13న విడుదలై ఘన విజయం సాధించింది. కాగా ఈ మూవీ త్వరలో ఓటీటీ వేదికపైకి కూడా రానుంది.. మరి అది ఎప్పుడు… ఎవరు దానిని కొనుగోలు చేశారో తెలుసుకుందామా…

కార్తికేయ-2 చిత్రం ఇటు సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలోనూ భారీ కలెక్షన్లు సాధించింది. విడుదలైన 30 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 120 కోట్లకు పైగా వసూళ్లును కైవసం చేసుకుంది. ఈ సినిమా ద్వారా నిఖిల్ నార్త్ ఇండస్ట్రీలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడనే చెప్పవచ్చు. అయితే వెండితెరపై ఘనవిజయం సాధించిన ఈ మూవీ త్వరలో డిజిటల్ ప్లాట్ ఫాంపై అడుగుపెట్టనుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు కొనుగోలు చేసిందట. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఓటీటీలో టెలికాస్ట్ కానుందని.. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టడం వల్ల నిఖిల్ తదుపరి సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. కాగా నిఖిల్ తదుపరి చిత్రం 18 పేజీలు కూడా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కూడా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాను దక్షిణాదిలో మాత్రమే విడుదల చేయాలని భావించినా… కార్తికేయ 2 విజయం వల్ల హిందీ వెర్షన్‌లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: Oke Oka Jeevitham: ఆడియన్స్ మెచ్చిన ఒకే ఒక జీవితం.. అమ్మ పాట విడుదల

Exit mobile version