Site icon Prime9

Kantara: కాంతార ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

court-clearance-to-varaharoopam-song-in-kantara-movie

court-clearance-to-varaharoopam-song-in-kantara-movie

Tollywood: కన్నడ చిత్రం ‘కాంతార’చిన్న సినిమాగా వచ్చి,దక్షిణాదిని ఒక ఊపు ఊపేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించింది. కాంతార సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్టయింది. ప్రమోషన్స్ ఎక్కువ చేయకున్నా రోజు రోజుకూ క్రేజ్ పెరిగింది. 16 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది.అదే కాకుండా ఒక్క కర్ణాటకలోనే కోటికి పైగా టిక్కెట్లు అమ్మకం ఒక రికార్డు. హీరో, దర్శకుడు రిషబ్ షెట్టి, హీరోయిన్ సప్తమి గౌడకు పేరు తెచ్చిపెట్టింది.

ఇంకా థియేటర్లలో సందడి చేస్తున్న ‘కాంతార’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీ నుండి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హక్కులు దక్కించుకుంది. అయితే ముందుగా ఈ నెల 4వ తేదీనే ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. కానీ, థియేటర్లలో వస్తున్న విశేష స్పందన రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ ను వాయిదా వేశారు. అయితే ఎట్టకేలకు వచ్చే వారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

Exit mobile version