Site icon Prime9

Unstoppable2: అన్‌స్టాప‌బుల్ 2 తాజా ప్రోమో వైరల్.. చిరంజీవి బాలకృష్ణ కాంబోలో సినిమా

balakrishna-unstoppable-2-episode-5-promo-goes-viral

balakrishna-unstoppable-2-episode-5-promo-goes-viral

Unstoppable2: నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్‌ షో అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 సూపర్ సక్సెస్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ వారం షో లో భాగంగా లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌తో కొత్త ఎపిసోడ్‌ రాబోతున్నట్టు ఇప్పటికే అప్‌డేట్‌ అందించింది ఆహా టీం.

కాగా తాజాగా ఇవాళ ఎపిసోడ్ 5 ప్రోమోను విడుదల చేసింది ఆహా 90 సంవత్సరాల తెలుగు సినిమా కీర్తి.. యుగ పురుషుడి (ఎన్టీఆర్‌)కి శత జయంతి నివాళిగా ఈ అద్భుతమైన ఎపిసోడ్‌ని డెడికేట్ చేసింది. దీన్ని మిస్ అవ్వకండి అంటూ తాజాగా ప్రోమోను విడుదల చేసింది. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ సరదా చిట్‌చాట్‌తో అభిమానులకు పసందైన వినోదాన్ని పంచుతున్నట్టు కనిపించింది.


తెలుగు సినిమా పొత్తిళ్లలో పుట్టినవాళ్లు, సినిమానే ప్రపంచంగా పెరిగినవాళ్లు మన నిర్మాతలు.. ది స్టాల్ వార్ట్స్ ఆఫ్‌ తెలుగు సినిమా అంటూ ముందుగా సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌.. ఆ తర్వాత రాఘవేంద్రరావుని స్టేజీపైకి ఆహ్వానించాడు బాలకృష్ణ. మనిద్దరి కాంబినేషనే బ్యాలెన్స్ అని బాలకృష్ణ అంటుండగా.. మీ (బాలకృష్ణ)తో, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా చేయాలని వెయిట్‌ చేస్తున్నానని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు అల్లు అరవింద్‌. ఈ కామెంట్స్ తో రానున్న రోజుల్లో అల్లు అరవింద్‌-చిరు-బాలయ్య కాంబోలో సినిమా రావడం గ్యారంటీ అని అభిమానులు పండగ చేస్కుకుంటున్నారు. మరి ఈ లెజెండరీ నిర్మాతలు మరియు డైరెక్టర్లతో బాలకృష్ణ ఎలా సందడి చేశాడు అనేది చూడాలంటే శుక్రవారం వరకు వేచిచూడాల్సిందే.

ఇదీ చదవండి: గర్భవతి అయిన మలైకా అరోరా.. ఆగ్రహం వ్యక్తం చేసిన అర్జున్ కపూర్

Exit mobile version