Site icon Prime9

ott movies: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు.. మీరు ఓ లుక్కేయండి!

balagam

balagam

ott movies: ఉగాది సందర్భంగా కొత్త సినిమాలు కాస్త ముందుగానే థియేటర్‌లో సందడి చేశాయి. ఈ వారం ఓటీటీలో అలరించేందుకు సినిమాలు, వెబ్ సిరీస్ లు సిద్దమయ్యాయి. మరి ఈ వారం ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

‘పఠాన్‌’ షురూ (ott movies)

షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీ, తెలుగు, తమిళ్‌ భాషల్లో అందుబాటులో ఉంది. ఓటీటీ ప్రేక్షకుల కోసం థియేటర్‌లో తొలగించిన కొన్ని సన్నివేశాలను జోడించారు. దీపిక పదుకొణె కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించారు. మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ చూడాలనుకునేవారికి ఈ వీకెండ్‌లో

బలగం కూడా వచ్చేస్తోంది!

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బలగం’. వేణు దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మార్చి 24వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సింప్లీసౌత్‌ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఫీల్‌గుడ్‌ మూవీ చూడాలనుకునేవారు ‘బలగం’ పరిశీలింవచ్చు.

 

విమానాన్ని హైజాక్‌ చేస్తే..

యామి గౌతమ్‌, సన్నీ కౌశల్‌, శరద్‌ ఖేల్కర్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘చోర్‌ నికల్‌ కె భాగా’. అజయ్‌ సింగ్‌ దర్శకుడు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మార్చి 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. విమానం హైజాక్‌ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మరికొన్ని సినిమాలు/వెబ్ సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్‌
వాకో (వెబ్‌సిరీస్‌) స్ట్రీమింగ్‌ మొదలైంది
ది నైట్‌ ఏజెంట్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 23
చోర్‌ నికల్‌ కె భాగా (హిందీ) మార్చి 24
హూ వర్‌ వుయ్‌ రన్నింగ్‌ ఫ్రమ్‌ (టర్కీస్ సిరీస్) మార్చి 24
హై అండ్‌ లో ద వరస్ట్ ఎక్స్ (కొరియన్ మూవీ) మార్చి 25
క్రైసిస్ (ఇంగ్లీష్ మూవీ) మార్చి 26
అమెజాన్‌ప్రైమ్‌
హంటర్‌ (హిందీ) మార్చి 22
పఠాన్‌ (హిందీ) మార్చి 22
బకాసురన్‌ (తమిళం) మార్చి 24
జీ5
కంజూస్‌ మక్కీ చూస్‌ (హిందీ) మార్చి 24
పూవన్‌ (మలయాళం) మార్చి 24
సోనీలివ్‌
పురుషప్రేతం (మలయాళం) మార్చి 24
బుక్‌ మై షో
మ్యాక్స్‌ స్టీల్‌ (హాలీవుడ్) మార్చి 24
ఆన్‌ ది లైన్‌ (హాలీవుడ్‌) మార్చి 24
ఆహా..
డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) మార్చి 24
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
సక్సెసెన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) మార్చి 26

Exit mobile version