Site icon Prime9

Narne Nithin : ఎన్టీఆర్ బావ మరిది “నార్నె నితిన్” హీరోగా కొత్త సినిమా స్టార్ట్..

ntr brother in law narne nithin new movie pooja ceremony

ntr brother in law narne nithin new movie pooja ceremony

Narne Nithin : యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావ మరిది “నార్నె నితిన్” హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. నితిన్ ఎన్టీఆర్ భార్యకి సోదరుడు అని అందరికీ తెలిసిందే. కాగా ఇప్పటికే ఇతను హీరోగా శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే సినిమాని కూడా ప్రకటించారు. అది ఇంకా రిలీజ్ అవ్వకముందే రెండో సినిమాని పట్టాలెక్కించినట్లు తెలుస్తుంది. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు నితిన్.  అంజి బాబు కంచిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అయితే ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా హీరో, హీరోయిన్స్ పై అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. అనంతరం దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పల్లెటూరు లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతుంది అని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది. ఇక మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్.

 

 

తారక్ కి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ యంగ్ టైగర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమాతో భారీ ఫ్లాప్ అందుకున్న కొరటాల ఇప్పుడు తారక్ సినిమాతో తిరిగి తన సత్తా ఏంటో చూపించాలని కసిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఎంతో క్లాస్ గా తెరకెక్కించాడు. ఇప్పుడు తారక్ తో మాస్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు.

దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా సముద్రం బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా అలనాటి అందాల భామ దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవర సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలై శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ఎన్టీఆర్ అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి చేరాయి.ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయని సమాచారం అందుతుంది.

Exit mobile version