Site icon Prime9

Niharika Konidela: ఈ సారి ఏకంగా సినిమానే నిర్మిస్తున్న నిహారిక ..

niharika konidala started new movie as producer

niharika konidala started new movie as producer

Niharika Konidela:  నిహారిక కొణిదెల సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. నిహారిక సమర్పణలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేశ్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి నటీనటులుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి నిహారిక సోదరుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్లాప్ కొట్టగా నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదు వంశీ సహా చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు.

నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఇప్పటి వరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ మాత్రమే చేస్తూ వచ్చాం. తొలి సారి ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. మాతో పాటు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తెలియని టెన్షన్‌గానూ ఉంది. యదు వంశీగారు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మంచి టీమ్‌, కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. అయితే మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం’’ అన్నారు. అలానే సినిమా డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ అందరి కొత్త వాళ్ళతో సినిమా చేయటం, ఆనందంగా ఉంది. ఇందులో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాంమని  అన్నారు.

Exit mobile version