Site icon Prime9

New York Critics Award for Rajamouli: రాజమౌళికి న్యూయార్క్ క్రిటిక్స్ అవార్డు

Rajamouli

Rajamouli

New York Critics Award for Rajamouli: దర్శకధీరుడు రాజమౌళిని మరో ప్రతిష్టాత్మక అవార్దు వరించింది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుకు  ఎస్ఎస్ రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ప్రతిష్టాత్మకమైన వాటిలో ఒకటి. టార్ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఆఫ్టర్ యాంగ్ మరియు ది బాన్‌షీస్ ఆఫ్ ఇనిషెరిన్ చిత్రాలలో కోలిన్ ఫారెల్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. టార్‌లో తన నటనకు కేట్ బ్లాంచెట్ ఉత్తమ నటిగా ఎంపికైంది. కే హుయ్ క్వాన్ ఉత్తమ సహాయ నటుడిగా, కేకే పాల్మెర్ ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకున్నారు.

ఈ సంవత్సరం న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయుడు SS రాజమౌళి. ఆస్కార్ కోసం అంతర్జాతీయ ఫీచర్ విభాగంలో భారతదేశం నుండి RRR ఎంపిక కానప్పటికీ, వేరియెన్స్ ఫిల్మ్స్ జనరల్ కేటగిరీలో ప్రచారాన్ని ప్రారంభించింది.స్టీవెన్ స్పీల్‌బర్గ్ మరియు ఆస్కార్ విజేత డారెన్ అరోనోఫ్స్కీ వంటి హాలీవుడ్ లెజెండ్‌లతో పోటీ పడి, రాజమౌళి RRR కోసం ఈ అవార్డును కైవసం చేసుకున్నారు, ఇది తెలుగు దర్శకుడి శక్తిని ప్రపంచానికి చాటింది.

Exit mobile version