Site icon Prime9

Bhola Shankar : “భోళా మానియా”కి గెట్ రెడీ అంటున్న మెగాస్టార్ చిరంజీవి..

new update from megastar chiranjeevi bhola shankar movie

new update from megastar chiranjeevi bhola shankar movie

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి.. నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’  (Bhola Shankar) కోసం మెగా ఫ్యాన్స్‌తో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను ఈ సినిమాపై ఫోకస్ పెట్టేలా చేస్తోంది చిత్ర యూనిట్. ఆగస్టు 11న రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ని రిలీజ్ చెయ్యనున్నారు.

ఈ సాంగ్ తో మెగా ఫెస్టివల్ ని స్టార్ట్ చేయడానికి మహతి స్వర సాగర్ రెడీగా ఉన్నాడు. జూన్ 4న రిలీజ్ కానున్న భోళా మేనియా సాంగ్ ప్రోమోని జూన్ 2న రిలీజ్ చెయ్యనున్నారు. ఈ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసిన ఆ పోస్టర్ లో స్టైల్, స్వాగ్ తో వింటేజ్ చిరు గుర్తొస్తున్నారు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ భోళా మేనియా సాంగ్ లో సూపర్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మరి శేఖర్ మాస్టర్ స్టెప్స్, చిరు గ్రేస్, మహతి స్వర సాగర్ కంపొజిషన్ అన్నీ కలిసి ‘భోళా మేనియా’ సాంగ్ ని ఎంత స్పెషల్ గా మార్చనున్నాయో చూడాలి. దాదాపు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఈ సాంగ్ ని భారీ స్థాయిలో చిత్రీకరించారని టాక్ నడుస్తుంది.

 

ఇక ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ వేదాలంకు రీమేక్‌గా తీసుకొస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరో చెల్లి పాత్రలో నటిస్తోంది. మరి భోళాశంకర్ కూడా భాషా సెంటిమెంట్ మనకు కనిపిస్తుందా అనేది చూడాలి. ఇందులో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇక మరోవైపు చిరు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే జోష్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.

Exit mobile version