Site icon Prime9

Nayanthara: హీరో ధనుష్‌పై నయతార సంచలన వ్యాఖ్యలు – ఇంతలా దిగజారియావ్‌ అంటూ ఆగ్రహం

Nayanthara Slams Dhanush For Demanding Rs 10 Cr: లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార స్టార్‌ హీరో ధనుష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన డాక్యుమెంటరి విషయంలో వీరద్దరి మధ్య వివాదం నెలకొన్నట్టు నయన్‌ తన వ్యాఖ్యల్లో వెల్లడించింది. అంతేకాదు ధనుష్ రియల్‌ లైఫ్‌లోనూ పెద్ద నటుడని, బయట, అభిమానులను మంచితనంతో మభ్యపెడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఇంత దిగజారిపోతావని అనుకోలేదంటూ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు నయన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బహిరంగ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం నయనతార లేఖ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

అసలేం జరిగిందంటే

నయనతార జీవితంపై నెట్‌ఫ్లిక్స్‌ ఓ డాక్యుమెంటరీ తీసిన సంగతి తెలిసిందే. ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ పేరుతో ఈ డాక్యుమెంటరీని తీశారు. అయితే ఇందులో నయన్‌ సినీరంగంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులతో పాటు తన ప్రేమ, పెళ్లి వరకు ప్రతి విషయాన్ని పొందుపరిచారు. తన భర్త విఘ్నెష్‌ శివన్‌తో పరిచయం ఎలా ఏర్పడిందో కూడా ఇందులో చూపించారు. ఇటీవల ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ని నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. అయితే ఇందులో ‘నానుమ్‌ రౌడీ దాన్‌'(తెలుగులో నేను రౌడీనే) సినిమాలోని క్లిప్‌ వాడటంపై ధనుష్‌ కాపీ రైట్‌ కేసు వేసినట్టు ఆమె తన లేఖలో పేర్కొంది.

నయన్‌ దంపతులకు కాపీ రైట్‌ నోటీసుల పంపడమే కాదు.. తన అనుమతి లేకుండ మూవీ క్లిప్స్‌ వాడినందుకు ఏకంగా రూ. 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్‌ చేశాడు. గత కొన్ని రోజులు ఈ వ్యవహరంలో నడుస్తుండటంతో చివరి నయన ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. తన లేఖలో “తండ్రి, ప్రముఖ డైరెక్టరైన సోదరుడి అండదండలతో గొప్ప నటుడిగా ఎదిగిన నువ్వు(హీరో ధనుష్‌ని ఉద్దేశిస్తూ) ఇది చదివి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. నా లాంటి వారు నిలదొక్కుకోవాలంటే సినిమా అనేది ఓ పోరాటం. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండ ఈ రంగంలో పోరాడి ఈ స్థాయికి చేరుకున్నా.

ఈ క్రమంలో నా వృత్తికి నన్ను అభిమానించే అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇందులో దాపరికం లేదు. అయితే నా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన డాక్యుమెంటరీ రిలీజ్‌ కోసం నేను మాత్రమే కాదు నా అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించి ఇది పూర్తి చేశాం. కానీ మీరు మాపై పెట్టుకున్న వ్యక్తిగత కక్ష్య వల్ల మాపైనే కాదు ఇందులో భాగమైన వారి జీవితాలపై కూడా ప్రభావం చూపుతుంది. నా సినీప్రయాణం, ప్రేమ, పెళ్లితో పాటు నాతో ఉన్న అనుబంధాన్ని ఇతరు నటీనటులు పంచుకోవడం వంటి విశేషాలతో ఈ డ్యాక్యుమెంటరీని తీశాం. అలాగే మా(నయతార-విఘ్నేష్‌ శివన్‌) జీవితాల్లో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్‌ రౌడీ దాన్’ (నేను రౌడీనే) ఇందులో భాగం కాకపోవడం బాధాకరం.

ఇందులో కొన్ని సీన్స్‌, పాటలు మా ప్రేమకు కరెక్ట్‌గా మ్యాచ్‌ అవుతాయి. వాటిని ఈ డాక్యుమెంటరీలో చూపించడానికి మీ నుంచి ఎన్‌ఓసీ కోసం రెండేళ్లు ప్రయత్నిస్తున్నాం. కానీ మాకు అనుమతి ఇవ్వడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఇది రిలీజ్‌ అవుతున్న సమయంలో కూడా మీ ఆమోదం కోసం ఎదురుచూశాం. కానీ మీ నుంచి మాకు ఎలాంటి సమాధానం లేదు. ఈ విషయంలో మీరు మాకు అనుమతి ఇవ్వకపోవడం నన్ను ఎంతోగానో బాధించింది. ఇలా మీరు మాపై ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని వెల్లగక్కారు” అని పేర్కొంది.

అదే విధంగా ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత మీరు పంపిన కాపీ రైట్స్‌ నోటీసలు చూసి షాక్‌ అయ్యాను. ట్రైలర్‌లో జస్ట్‌ మూడు సెకన్ల క్లిప్స్‌ వాడినందుకే రూ. 10 కోట్లు డిమాండ్‌ చేయడం సరైనదేనా? ఇందులో మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిపోతుంది. నీ అభిమానుల ముందు, బయట నువ్వు ఎంతలా నటిస్తావో తెలుస్తోంది. స్టేజ్‌పై నువ్వు చెప్పే నీతి సూక్తులు నువ్వు పాటించవని అర్థమైపోతుంది. బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. కానీ మాతో కూడా నువ్వు అలా నటించకు. నీ నిజస్వరూపం ఏంటో తెలుసు. చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం చాలా బాధగా ఉంది. నువ్వు ఇంతలా దిగజారిపోతావని ఊహించలేదు. మీ నోటీసులకు మేము న్యాయబద్ధమైన సమాధానం చెబుతాం. మా నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ కోసం ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ ఫోటోలు, పాటలు ఉపయోగించడానికి మీరు ఎన్‌ఓసీ ఇవ్వడానికి నిరాకరించడాన్ని న్యాయస్థానం కాపీరైట్‌గా పరిగణించవచ్చు. కానీ నైతిక కోణం అనేది ఒకటి ఉటుందని, దానికి దేవుడే సమాధానం చెబుతాడు” అంటూ విమర్శించింది.

అలాగే సినిమా విడుదలై 10 ఏళ్లు దాటింది. ఇంకా లోపల ఒకలా, బయటకు మరోలా నటిస్తూ ప్రపంచాన్ని మోసం చేస్తున్నావు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవ్వడం నీ ఇగోని దెబ్బతీసింది. అప్పటి నుంచి మాపై వ్యక్తిగతం కక్ష్య పెంచుకున్నావని తెలుసు. ఈ సినిమా సక్సెస్‌ పై కూడా పలుమార్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేశావ్‌. బిజినెస్‌ లెక్కలు పక్కన పెడితే తోటి వారి జీవితాలను ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్‌ కాదు. ఇలాంటి విషయాల్లో కాస్తా మర్యాదగా నడుచుకుంటే మంచిది. తమిళనాడు ప్రజలు ఇలాంటివి సహించరు” పేర్కొంది. ఈ లెటర్‌ ద్వారా తాను ఒక్కటే చెప్పాలనుకుంటున్నానని, ఎదుటి వారి సక్సెస్‌ చూసి ఈర్ష్య పడటం ఇప్పటికైనా మానుకుంటావని ఆశిస్తున్ననంటూ హితవు పలికింది. నీకు తెలిసివాళ్లు ఎదిగితే తప్పు కాదని, బ్యాగ్రౌండ్‌ లేని వాళ్లు స్టార్స్‌ అయితే తప్పేం లేదని, ఈ ప్రపంచం నీ సొంతం కాదంటూ చురకలు అట్టించింది. చివరిగా తన లేఖలో ఉన్న అంశాలను ఎప్పటికైన మార్చేసి కొత్త కథ అల్లేసి చెబుతావని కూడా తెలుసంటూ నయన్‌ ధనుస్‌కి షాకిచ్చింది.

Exit mobile version