Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నవీన్ చంద్ర. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నవీన్ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఈయన తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో హీరోగా నటించారు. ప్రస్తుతం హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు నవీన్ చంద్ర. గత ఏడాది ఓర్మా అనే అమ్మాయిని నవీన్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ యంగ్ హీరో అందరితో ఒక న్యూస్ షేర్ చేసుకున్నాడు.
బాబుకి మీ ఆశీర్వాదాలు కావాలి – నవీన్ చంద్ర
తాజాగా గత కొద్ది రోజుల క్రితం తన భార్య బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ త్వరలోనే తాను తండ్రి కాబోతున్నానని గుడ్ న్యూస్ అందరితో పంచుకున్నారు. అయితే ఈయన ఈ పోస్ట్ చేసిన వారానికి తన భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇలా నవీన్ చంద్ర భార్య ఫిబ్రవరి 22వ తేదీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే ఈయన తన కొడుకును ఎత్తుకొని ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మాకు బాబు పుట్టాడు అంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఇతర నటీనటులు నవీన్ చంద్ర దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నవీన్ చంద్ర డిసెంబర్ 2, 1988న కర్ణాటకలోని బళ్లారిలో జన్మించాడు. నవీన్ చంద్ర బళ్లారిలోని దేవి నగర్‌లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి KSRTC లో హెడ్ మెకానిక్. నవీన్ చంద్ర మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాడు. సినిమాల్లోకి రాకముందు మల్టీమీడియా యానిమేటర్‌గా కూడా పనిచేశాడు. 2006లో సంభవామి యుగే యుగే సినిమాతో నవీన్ తెలుగులో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చందు కళ్యాణం సినిమాలో నటించాడు. మరోవైపు పజనియప్ప కల్లూరితో తమిళంలో కూడా హీరోగా అరంగేట్రం చేశాడు.
అరవింద సమేత వీర రాఘవ, విరాట పర్వం, అమ్ము, రంగా రంగా వైభవంగా మూవీ సహా పరంపర అనే వెబ్ సిరీస్లో కూడా యాక్టే చేశాడు. ప్రత్యేక గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తూ తనకుంటూ ఓ గుర్తింపు దక్కించుకున్నారు నవీన్ చంద్ర. ప్రస్తుతం ఈ హీరో రామ్ చరణ్ RC15 చిత్రంతోపాటు పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అలానే అభిమానులు నవీన్ చంద్రకి అభినందనలు తెలియజేస్తున్నారు. కంట్రాగ్స్ బ్రో అని కొంత మంది చెబుతుండగా.. ఇంకో వ్యక్తి మాత్రం ఒక్క మాటలో.. చిన్నారిని మీరు తాకినప్పుడు ఎలా అనిపించిందో చెప్పాలని కామెంట్ చేశారు. అందుకు ప్రపంచం సరిపోదని నవీన్ చంద్ర రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలో పలువురు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/