Site icon Prime9

Oscar Award Nominations 2022: ఆస్కార్ బరిలో శ్యామ్‌ సింగ రాయ్‌

Tollywood: నాచురల్ స్టార్‌ నాని, లేడీ పవర్‌ స్టార్‌ సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన శ్యామ్‌ సింగ రాయ్‌ సినిమా ఏ రేంజ్‌లో హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లిద్దరి కెరియర్‌లో ఉన్న బెస్ట్‌ సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా రీసెంట్‌గా మరో రికార్డ్‌ సాధించింది. ప్రఖ్యాత ఆస్కార్‌ అవార్డ్స్‌లో మూడు విభాగాల్లో ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్‌ అఫిషియల్‌గా అనౌన్స్‌ చేసింది.

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ పీరియాడిక్ ఫిల్మ్ మరియు బెస్ట్ క్లాసిక్ కల్చరల్ డ్యాన్స్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీలలో ఆస్కార్ బరిలో ఉంది. 95వ ఆస్కార్‌కు నామినీలను జనవరి 24, 2023న ప్రకటిస్తారు. సాధారణ ఎంట్రీ కేటగిరీల సమర్పణ గడువు ఈ ఏడాది నవంబర్ 15తో ముగుస్తుంది.

శ్యామ్ సింగ రాయ్ చిత్రం 1970లలో కోల్‌కతాలో నివసించిన మరియు దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించిన రచయిత, కధ, ఈ చిత్రంలో కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమథన్, జిషు సేన్‌గుప్తా, మురళీ శర్మ, మనీష్ వాధ్వా మరియు లీలా శాంసన్ తదితరులు నటించారు.

Exit mobile version