Site icon Prime9

Dasara Movie: మార్చి 30న విడుదలవుతున్న ’దసరా‘

Tollywood: నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తన మొదటి పాన్ ఇండియా చిత్రం దసరాతో రాబోతున్నాడు. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ నిన్న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మార్చి 30, 2023న శ్రీరామ నవమి సందర్భంగా దసరా సినిమా థియేటర్లలోకి రానుంది.

ఏ సినిమాకైనా 4 రోజుల లాంగ్ వీకెండ్ ఖచ్చితంగా ఒక పెద్ద అడ్వాంటేజ్. దసరా రిలీజ్ రోజు సెలవు. అంతేకాకుండా, వేసవి ప్రారంభంలో విడుదల చేయడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాకి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. పోస్టర్‌లో నాని మాస్ అవతార్‌లో చేతిలో ఆల్కహాల్ బాటిల్ పట్టుకుని ఉండగా వెనుక నటి సిల్క్ స్మిత కనిపిస్తోంది. దసరా పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని పోస్టర్ తెలియజేస్తోంది.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కథ పూర్తిగా తెలంగాణలోని గోదావరిఖని నేపథ్యంలో సాగుతుంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని పల్లెటూరి పాత్రలో కనిపించనున్నాడు.

 

Exit mobile version