Nandamuri Balakrishna : ఫ్యామిలి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో ” జగపతి బాబు “. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న జగపతి బాబు… లెజెండ్ సినిమాతో తనలోని విలనిజాన్ని బయటపెట్టారు. ఇక అప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతూ వరుస సినిమాలు చేస్తున్నారు. రంగస్థలం , గూఢచారి, అరవింద సమేత లాంటి చిత్రాల్లో తన విలనిజంతో అందరికి షాకిచ్చారు. ఇక ప్రస్తుతం జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చాలా బిజీగా ఉన్నారు.
అయితే ఇప్పుడు జగపతి బాబు మెయిన్ లీడ్ గా చేస్తున్న చిత్రం “రుద్రంగి”. మమతా మోహన్‌దాస్, ఆశిష్ గాంధీ, విమలా రామన్ ముఖ్య పాత్రలు పోషించారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది. కాగా ఈ చిత్రానికి తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాతగా వ్యవహరించడం మరో విశేషం అని చెప్పాలి. జులై 7న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం (జూన్ 29) నాడు హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. యాంకర్ సుమ అతిథుల్ని వేదిక పైకి ఆహ్వానిస్తూ ఒక్కొక్కరి గురించి చకచకా చెబుతూ ఉంది. ఇంతలో జగపతి బాబు ప్రసంగించడానికి రెడీ అయ్యారు. కానీ సుమ జగపతి బాబుకి మైక్ ఇవ్వకుండా ఆయన్ని పొగిడే కార్యక్రమం పెట్టుకుంది. దీనితో పక్కనే ఉన్న బాలయ్య (Nandamuri Balakrishna).. సుమ బిత్తరపోయేలా చేశారు. అహే ఆపు.. లొడలొడా వాగేస్తున్నావ్ అంటూ సరదాగా అన్నారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సుమ సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోయింది. అ తర్వాత మళ్ళీ సుమ గురించి చెబుతూ.. ఈమెకు కొంచెం చెంప దెబ్బలు అప్పుడప్పుడు అవసరం. అయితే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెప్పులు తీసుకోని చెప్పు దెబ్బలు కొడుతోంది మనల్ని. పాపం ఆ రాజీవ్ కనకాల ఎలా బ్రతుకుతున్నాడో ఈమెతో” అంటూ కాసేపు సుమని ఆటపట్టించాడు.
అలాగే ఈ సినిమాలో నటించిన మమతా మోహన్‌దాస్ గురించి మాట్లాడుతూ.. “ఆమె ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా వీర వనిత అని అన్నారు. ఆమె కాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. కాన్సర్ అనే భయమే ఆ వ్యక్తిని సగం చంపేస్తుంది. కానీ ఆమె ధైర్యంగా పోరాడి నేడు మళ్ళీ ఇలా మన ముందుకు వచ్చారు. ఎంతో మంది మహిళలకు, ప్రతి క్యాన్సర్ రోగికీ మమతా మోహన్‌దాస్ ఆదర్శంగా నిలిచారని బాలయ్య ప్రశంసించారు. ప్రయస్థుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.