Site icon Prime9

Nandamuri Balakrishna : బాలయ్య 108 చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. ఇగ మాస్ ఊచకోత షురూ !

Nandamuri Balakrishna 108 movie titled as bhagavanth kesari

Nandamuri Balakrishna 108 movie titled as bhagavanth kesari

Nandamuri Balakrishna : నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్.. “నందమూరి బాలకృష్ణ” ప్రస్తుతం ఫుల్ జోష్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఎక్కువగా కామెడీ సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న అనిల్ రావిపూడి బాలయ్యని ఏ విధంగా చూపిస్తారో అని అంతా అనుకున్నారు. కానీ ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్స్ తో నెక్స్ట్ లెవల్ పక్కా అని క్లారిటీ ఇచ్చేశాడు.

కాగా జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు అని అందరికీ తెలిసిందే. ఈ మేరకు ఫ్యాన్స్ అందరికీ బాలయ్య బర్త్ డే గిఫ్ట్ ని రెండు రోజుల ముందుగానే ఇచ్చేశారు NBK 108 టీమ్. ఈ మేరకు బాలయ్య – అనిల్ రావిపూడి కాంబోలో సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా టైటిల్ తో పాటు కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిట్ ఖరారు చేశారు. ‘ఐ డోంట్ కేర్’ అని ఉప శీర్షిక ఇచ్చారు.

 

ఈ సినిమాలో కాజల్ కథానాయికగా చేస్తుండగా.. బాలయ్య సోదరుడిగా తమిళ స్టార్ శరత్ కుమార్ నటిస్తుండగా.. ఆయన కూతురుగా శ్రీలీల కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి బాలయ్య సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా.. హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.      షైన్‌స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భగవంత్ కేసరి సినిమాను దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టైటిట్ ఫవర్ ఫుల్‌గా ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న బాలయ్యకు మరో హిట్ ఖాయమని నందమూరి ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ తో ఓ రికార్డ్ కూడా క్రియేట్ చేశారు బాలయ్య, అనిల్ రావిపూడి టీమ్. ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఎప్పుడు లేని విధంగా బాలయ్య 108 మూవీ కాబట్టి.. 108 లొకేషన్లలో.. 108 హోర్టింగ్స్ మీద ఈ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. అంతే కాదు బాలకృష్ణ అభిమానుల కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో సర్ ప్రైజ్ గిఫ్ట్ ను కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది. పుట్టిన రోజుకు రెండు రోజుల ముందుగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. బాలయ్య బర్త్ డే రోజు “భగవంత్ కేసరి” స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం అందుతుంది.

అదే విధంగా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన కూడా రానుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. బాలయ్య హీరోగా మెగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా చేయనున్నారు. చూడాలి మరి ఈ అనౌన్స్ మెంట్ కూడా డబుల్ బొనాంజాలా వస్తుందేమో అని.

Exit mobile version